Rahul Gandhi Enters Telangana: భారత్ జోడో యాత్ర కర్ణాటక నుండి తెలంగాణలోకి ప్రవేశించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఎదురెళ్లి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తల సందడితో కృష్ణా నది బ్రిడ్డి జన సంద్రమైంది.
భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన అనంతరం గూడబల్లేరు వద్ద టీపీసీసీ ఏర్పాటు చేసిన తొలి సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు అని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్.. రెండూ కలిసి దేశంలో మతకల్లోలాలు సృష్టించి దేశాన్ని విచిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని.. వారి కుటిల ప్రయత్నాలను అడ్డుకునే లక్ష్యంతో దేశ సమైక్యత కోసమే తాను ఇలా భారత్ జోడో యాత్ర చేపట్టానన్నారు. భారత్ జోడో యాత్రతో దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
LIVE: #BharatJodoYatra | Yermarus to Gudebellur | Raichur to Mahbubnagar | Karnataka to Telangana https://t.co/5mZB8Ruj6X
— Bharat Jodo (@bharatjodo) October 23, 2022
భారత్ జోడో యాత్రలో 3 రోజులు దీపావళి బ్రేక్
కన్యాకుమారిలో సెప్టెంబర్ 6న ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో పాత యాత్ర నేడు తెలంగాణలోకి ప్రవేశించగా.. రాష్ట్రంలో 16 రోజుల పాటు 376 కిలో మీటర్లు పర్యటించిన అనంతరం తెలంగాణ నుండి మహారాష్ట్రలోకి ఎంటర్ కానున్నారు. ఇదిలావుంటే, దీపావళి సందర్భంగా భారత్ జోడో యాత్రకు 3 రోజులు పాటు విరామం ఇస్తున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి భారత్ జోడో యాత్రను తిరిగి ఇక్కడి నుంచే మొదలు పెట్టనున్నట్టు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.
Also Read : TRS VS BJP: కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం కౌంటర్.. బీజేపీ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి?
Also Read : Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి మరో వీడియో లీక్.. మునుగోడు గ్రౌండ్ రిపోర్ట్ చెప్పేశాడు?
Also Read : Komatireddy Rajagopal Reddy: చేతలతోనే బొంద పెడతా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Also Read : Komati Reddy Venkat Reddy: బిగ్ బ్రేకింగ్.. కోమటిరెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rahul Gandhi in Telangana: తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి ఘన స్వాగతం.. జన సంద్రమైన గూడబల్లేరు