Malabar Spinach: గుండెను, మెద‌డును ఆరోగ్యంగా ఉంచ‌డంలో బచ్చలికూర ఎంతో లాభం..!

Malabar Spinach Benefits: ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. వీటిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. అయితే మార్కెట్‌లో వివిధ రకాల ఆకుకూరలను లభిస్తాయి. అందులో బచ్చలికూర ఆకు ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. బచ్చలికూర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2023, 03:34 PM IST
Malabar Spinach: గుండెను, మెద‌డును ఆరోగ్యంగా ఉంచ‌డంలో బచ్చలికూర ఎంతో లాభం..!

malabar spinach benefits: ఆకుకూరలలో చాలా చవకగా దొరికేది బచ్చలికూర. బచ్చలికూరను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. బచ్చలికూర ద్వారా మెదడుకు, గుండెకు చాలా లాభాల కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  అయితే ఈ బచ్చలి కూరను ఎలా తీసుకుకోవాలి అనే అంశంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బచ్చలికూరను ఇలా తీసుకోవచ్చు..

బచ్చలికూరను వండటం, ఉడకబెట్టం, రసంగా చేసుకోవచ్చు.  రోజు తీసుకోనే ఆహారంతో పాటు దీని కూడా ఒక భాగంగా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. బచ్చలికూరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి, దీని కారణంగా కంటి ఆరోగ్యాన్ని, రక్తపోటును, మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

బచ్చలికూర కంటి ఆరోగ్యానికి: కంటి చూపు సరిగా ఉంచడంలో బచ్చలికూర ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే జియాక్సంతిన్‌, లుటిన్‌ గుణాలు ఆరోగ్యకరమైన కంటి చూపుని అందిస్తుంది. బచ్చలికూరను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక కంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. 

రక్తహీనత: చాలా మంది రక్తహీనత సమస్యలతో బాధపడుతుంటారు. రక్తహీనత కారణంగా ఎర్రరక్తకణాలు దెబ్బతింటాయి. దీనికి కారణం ఐరన్‌ లెవల్స్‌ తక్కువ గా ఉండటం. బచ్చలికూరలో ఐరన్‌ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి బచ్చలికూరను తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యనికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also read: Phlegm Causes: కఫం సమస్యతో బాధపడుతున్నారా? తప్పక ఈ ఇంటి చిట్కాలను పాటించండి !

మెదడు పనితీరు: బచ్చలికూర తినడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  మెదడుకు అవసరమయ్యే లుటిన్, కెరోటిన్, విటమిన్-ఏ, యాంటీ ఆక్సిడెంట్ల బచ్చలికూరలో అధికంగా ఉంటాయి. 

రక్తపోటు నియంత్రించడంలో: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారు బచ్చలికూర తప్పకుండా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తపోటును నియంత్రచడంలో సహాయపడుతుంది. బచ్చలికూర లాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News