Milk Precautions: ఆస్తమా రోగులు పాలు తాగవచ్చా లేదా, నిజానిజాలేంటి

Milk Precautions: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తుంటాయి. ఏవి ఎంతవరకు అవసరమో గుర్తించి తీసుకోగలిగితే ఎప్పటికీ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు. అందులో ఒకటి పాలు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2024, 04:26 PM IST
Milk Precautions: ఆస్తమా రోగులు పాలు తాగవచ్చా లేదా, నిజానిజాలేంటి

Milk Precautions: పాలను సాధారణంగా సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు, విటమిన్లు  పెద్దమొత్తంలో ఉంటాయి. పాలను దాదాపుగా అందరూ తీసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు వయస్సుతో తేడా లేకుండా అందరికీ  ఆరోగ్య రీత్య చాలా మంచివి. అయితే ఆస్థమా రోగులకు మాత్రం పాలు ఎంతవరకు ఉపయోగకరం అనే విషయంలో పలు వాదనలు, శోధనలు ఉన్నాయి. ఆ వివరాలు పరిశీలిద్దాం.

పాలు కానీ లేదా పాల ఉత్పత్తులు కానీ నిస్సందేహంగా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు చాలా ఉంటాయి. అయితే ఆస్తమా రోగులపై పాల ఉత్పత్తులు ప్రతికూల ప్రభావం చూపిస్తాయనే వాదన చాలాకాలంగా ఉంది. ఆస్తమా రోగుల్లో ఆక్సిజన్ సరఫరా చేసే రక్త నాళాల్లో స్వెల్లింగ్, సంకోచం కన్పిస్తుంది. దాంతో ఆందోళన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో పట్టేసినట్టుండటం, దగ్గు వంటి లక్షణాలు కన్పిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో పాలు తీసుకుంటే కొంతమందిలో ఆ లక్షణాలు పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఇది అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. వ్యక్తిని బట్టి మారుతుంటుంది. 

వాస్తవానికి ఆస్తమా అనేది ఓ దీర్ఘకాలిక వ్యాది. శ్వాస సంబంధ సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆస్తమా లక్షణాలు వ్యక్తిని బట్టి మారవచ్చు. తీవ్రత కూడా వేర్వేరుగా ఉంటుంది. అలర్జీ, శ్వాస సంక్రమణం, వ్యాయామం, కాలుష్యం వంటివాటి వల్ల ఈ లక్షణాలు మరింతగా పెరుగుతాయి. ఆస్థమాకు వయస్సుతో సంబంధం లేదు. జీవనశైలి ఆస్తమాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 

పాల ఉత్పత్తులతో ఆస్తమా పెరుగుతుందా

పాల ఉత్పత్తుల్లో కైసిన్ , వే ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్ల పట్ల కొందరికి సెన్సిటివిటీ ఏర్పడవచ్చు. అలాంటి వ్యక్తులు పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శరీరంలో ఓ రకమైన ప్రతిక్రియ ప్రారంభమౌతుంది. దాంతో ఆస్తమా లక్షణాలు పెరుగుతాయి. పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఆస్తమా రోగి రక్త నాళికల్లో కఫం పెరిగే అవకాశాలున్నాయి. ఈ కఫం అనేది ఆక్సిజన్ సరఫరా చేసే నాళికల్లో ఆటంకం కల్గిస్తుంది. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. ఆస్తమా రోగుల్లో పాల ఉత్పత్తులు ఎలర్జీకు కారణం కావచ్చు. ఇది రెస్పిరేటరీ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. 

స్థూలంగా చెప్పాలంటే పాల ఉత్పత్తులతో ఆస్తమా రోగుల్లో మిశ్రమ ఫలితాలు వివిద అధ్యయనాల్లో వెల్లడయ్యాయి. కొందరిలో పాల ఉత్పత్తులు సానుకూలంగా కన్పిస్తే మరి కొన్ని అధ్యయనాల్లో ప్రతికూల ప్రభావమే కన్పించింది. అయితే పాల ఉత్పత్తులు తీసుకోవచ్చా లేదా అనేది నిర్ధారించేందుకు శాస్త్రీయంగా ఇంకా ఎలాంటి రుజువులు లేవు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సి ఉంది. 

Also read: AP Inter Supplementary: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News