Immunity Boosting: రోగనిరోధక శక్తిని పెంచి, ఆర్యోగంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే!

Immunity Boosting Foods: శీతాకాలంలో చాలా మంది అనారోగ్యసమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, కీళ్ల నొప్పలు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యలు రావడానికి కారణం శరీరంలో రోగనిరోధన శక్తి తగ్గడం. అయితే రోగనిరోధక శక్తి పెండచడంలో కొన్ని ఆహారపదార్థాలు సహాయపడుతాయి. ఆ పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 04:41 PM IST
Immunity Boosting: రోగనిరోధక శక్తిని పెంచి, ఆర్యోగంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే!

Immunity Boosting Foods: మనలో చాలామంది తరుచు అనారోగ్యసమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల కారణంగా కలిగే అనారోగ్యసమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. దీనికి కారణం రోగనిరోధక శక్తి తగ్గడం. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు తరుచు అనారోగ్య సమస్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది. అయితే రోగనిరోధక శక్తి పెంచుకోవడంలో కొన్ని ఆహారపదార్థాలు సహాయపడుతాయి. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

మనం తీసుకొనే ఆహారంలో ప్రోటీన్, మినరల్స్‌తో పాటు జింక్‌ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది దానిపై మనం తెలుసుకుందాం..

1. ఆమ్ల: 
రోగనిరోధకశక్తి పెంచడంలో ఆమ్ల ఎంతో ఉపయోగపడుంది. ఇందులోని విటమిన్‌ సి జలుబు,దగ్గు వంటి సమస్యలు రాకుండా రక్షిస్తుంది. 

2. పసుపు: 
మనం తరుచు వంటల్లో పసుపును వాడుతూ ఉంటాం. దీనిని తీసుకోవడం వల్ల  రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగపడుంది. అలాగే రోగనిరోధక శక్తి పెంచడానికి  సహాయపడుతుంది.

౩. బ్రోకలీ: 
బ్రోకలీని చాలా మంది తినకుండా ఉంటారు. కానీ ఇందులో విటమిన్‌ సి, ఎ,ఇ అధికంగా లభిస్తాయి.  బ్రోకలీ రోగినిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

4. పెరుగు: 
పెరుగును తీసుకోవడం వల్ల లాక్టిక్‌ యాసిడ్‌, విటమిన్ డి వంటి గుణాలను పొందవచ్చు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా రక్షిస్తుంది.

Also read: Health Tips: పరగడుపున పచ్చి వెల్లుల్లి…ప్రయోజనాలు ఎన్నో

5. స్పినాచ్: 
ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా స్పినాచ్‌ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్‌ ఎ, సి, ఇ లభిస్తాయి. 

6. అల్లం: 
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాం. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్‌లో అల్లం ఒకటి.

7. వెల్లుల్లి: 
వెల్లులి తీసుకోవడం వల్ల గుండె జబుల బారిన పడకుండా ఉంటాం. దీని వల్ల రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి తినడం వల్ల జలుబు సమస్యతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందవచ్చు.

Also read: Foods To Control Bad Cholesterol: ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News