Pomegranate For Diabetes: మధుమేహంతో బాధపడుతున్న వారు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడడమే కాకుండా ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. కాబట్టి వీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధిక పరిమాణంలో పెరిగితే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. లేదంటే పలు ఇంటి చిట్కాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మతో మధుమేహం వ్యాధిగ్రస్తులకు కలిగే ప్రయోజనాలు:
పూర్వీకులు దానిమ్మ పండు గురించి ఎంతో అభివర్ణించారు. ఒక దానిమ్మ పండు నూరు జబ్బులను మాయం చేస్తుంది కాబట్టి వాటిని తప్పకుండా వినియోగించాలని వారు పేర్కొన్నారు. దానిమ్మలో ఉండే గుణాలు మధుమేహం వ్యాధిగ్రస్తులకు చాలా రకాలుగా సహాయపడతాయని ప్రముఖ డయాబెటిస్ నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మలు లభించే పోషకాలు:
దానిమ్మలు శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, ఫైబర్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, పొటాషియం, క్యాల్షియం జింక్ వంటివి లభిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు అల్పాహారానికి ముందు ఈ పండును తీసుకోవాలి.
దానిమ్మ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
>>దానిమ్మను ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తీసుకుంటే.. రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ డయాబెటిస్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని జ్యూస్ లా చేసుకుని మధుమేహం ఉన్నవారు మధ్యాహ్నం పూట తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
>>దానిమ్మలో ఉండే క్యాల్షియం, ఫైబర్, జింక్ రక్తహీనత రక్తంలో సమస్యలను సులభంగా తగ్గించేందుకు సహాయపడతాయి. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది రక్తహీనతకు గురవుతున్నారు. దీనివల్ల అలసట బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అయితే దీనికి పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి దానిమ్మను ఆహారం తీసుకునే క్రమంలో వినియోగించాలి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు ఎర్ర రక్త కణాలను పెంచేందుకు దోహదపడతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..
Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook