Pre Diabetes Symptoms: ప్రీ డయాబెటిస్ లేదా బోర్డర్ లైన్‌లో ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి, ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి

Pre Diabetes Symptoms: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైంది. ఒకసారి సోకిందంటే జీవితాంతం వదలదు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న మధుమేహన్ని నియత్రించడం మాత్రం సాధ్యమే. అందుకే సకాలంలో గుర్తించగలగాలి. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2023, 02:24 PM IST
Pre Diabetes Symptoms: ప్రీ డయాబెటిస్ లేదా బోర్డర్ లైన్‌లో ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి, ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి

Pre Diabetes Symptoms: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ప్రమాదకరమైందిగా మధుమేహాన్ని పరిగణిస్తారు. మధుమేహం నియంత్రణ ఎంత సులభమో..నిర్లక్ష్యం వహిస్తే అంత ప్రమాదకరమౌతుంది. ఇందులో డయాబెటిస్ బోర్డర్ లైన్‌లో ఉంటే ప్రీ డయాబెటిస్‌గా భావిస్తారు.

డయాబెటిస్ బోర్డర్ లైన్ లేదా ప్రీ డయాబెటిస్ దశలో కొన్ని విచిత్రమైన లక్షణాలు లేదా సంకేతాలు వెలువడుతుంటాయి. ఈ లక్షణాల్ని సకాలంలో పసిగట్టగలిగితే నియంత్రణ సులభమౌతుంది. ప్రీ డయాబెటిస్ అనేది టైప్ 2 డయాబెటిస్‌కు ముందు అభివృద్ధి చెందుతుంటుంది. దీనినే ఇంపెయిర్డ్ పాస్టింగ్ గ్లూకోజ్ లేదా గ్లూకోజ్ ఇన్‌టోలరెన్స్‌గా పిలుస్తారు. అంటే మీ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్టు అర్ధం. అయితే మధుమేహం ఉందనేంత ఎక్కువైతే కాదు. ఈ దశలో సులభంగా నియంత్రించవచ్చు. 

ప్రీ డయాబెటిస్ దశ ఎలా ఉంటుంది.

ప్రీ డయాబెటిస్ దశలో మీ శరీరంలోని పాంక్రియాస్ ఇంకా ఇంజెస్టెడ్ కార్బోహైడ్రేట్స్ రెస్పాన్స్‌లో తగిన ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే రక్త సరఫరా నుంచి చక్కెర శాతాన్ని తొలగించడంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గుతుంటుంది. అందుకే గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా కన్పిస్తుంది. ఈ పరిస్థితినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు.

ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ మధ్య అంతరం

ప్రీ డయాబెటిస్ అంటే మధుమేహం సోకిందని అర్ధం కానే కాదు. ఇదొక హెచ్చరిక మాత్రమే. ఈ దశలో జాగ్రత్తగా ఉండాలి. ప్రీ డయాబెటిస్ వ్యక్తుల్లో టైప్ 2 డయాబెటిస్ ముప్పు సాధారణ బ్లడ్ షుగర్ లెవెల్ కలిగిన వ్యక్తులతో పోలిస్తే 5-15 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీ డైట్, జీవనశైలిని మంచిగా మార్చుకుంటే మధుమేహం సమస్య తలెత్తదు. లేకపోతే ఆ సమస్య ఏర్పడుతుంది.

ప్రారంభదశలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వ్యక్తికి టైప్ 2 డయాబెటిస్ వృద్ధి చెందుతుంది. ఒకవేళ ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే అలా జరుగుతుంది. ప్రీ డయాబెటిస్ అనేది 10 శాతమే ముందుగా తెలుస్తుంది. చాలామందిలో ఏ విధమైన సంకేతాలు లేదా లక్షణాలు కన్పించవు.

బోర్డర్ లైన్ డయాబెటిస్

ఒకవేళ మీలో కొన్ని లక్షణాలు లేదా అంశాలు గమనిస్తే తక్షణం బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. లేకపోతే టైప్ 2 డయాబెటిస్ బారినపడతారు. ముఖ్యంగా బరువు పెరగడం, స్థూలకాయం సమస్య, శరీరం యాక్టివ్‌గా లేకపోవడం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ కుటుంబనేపధ్యం, 4 కిలోల కంటే ఎక్కువ బరువుండే పిల్లల్ని కనడం కొన్ని కీలకమైన లక్షణాలు కావచ్చు.

కంటి వెలుతురు తగ్గిపోవడం, నరాల డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్, గుండె రోగాలు కూడా బోర్డర్ లైన్ డయాబెటిస్ కారకాలు.

Also read: Tonsillitis Symptoms: టాన్సిల్స్ ప్రారంభ లక్షణాలెలా ఉంటాయి, ఎలా గుర్తు పట్టవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News