Benifits of Rice Water: జుట్టు నెరిసినా.. చర్మం కాస్త రంగు తగ్గినా చాలామంది తెగ బాధపడిపోతుంటారు. జుట్టు నెరవకుండా, ముఖంపై చర్మం కాంతిని కోల్పోకుండా రకరకాల టిప్స్ ట్రై చేస్తుంటారు. అలాంటివారికి 'రైస్ వాటర్'తో మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖంపై కాంతివంతమైన ఛాయకు, జుట్టు రాలడాన్ని నివారించేందుకు 'రైస్ వాటర్' బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు.
'రైస్ వాటర్' ప్రిపరేషన్ :
- మొదట తెల్ల బియ్యాన్ని పెద్ద కుండలో వేయండి.
- కుండలో బియ్యానికి మూడు రెట్లు నీటిని పోయండి
- ఐదు నిమిషాల పాటు కుండలో బియ్యం ఉండకనివ్వండి
- ఆ తర్వాత, బియ్యపు నీటిని కంటైనర్‌లో ఫిల్టర్ చేసి నిల్వ చేయండి.
రైస్ వాటర్‌తో చర్మ సంరక్షణ :
రైస్ వాటర్‌ను మీ ముఖానికి అప్లై చేయడం ద్వారా... అది మీ ఛాయను మెరుగుపరుస్తుంది. చర్మంపై పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది.
- ముఖంపై ముడుతలను నివారించడంలోనూ రైస్ వాటర్ మంచి ఫలితాలనిస్తుంది. రైస్ వాటర్‌లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి,విటమిన్ ఇ చర్మంపై ముడుతలను తొలగించడంలో దోహదపడుతాయి.
-రైస్ వాటర్‌తో ముఖంపై మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.
కేశ సంరక్షణకు రైస్ వాటర్:
సాధారణంగా తల స్నానం కోసం మార్కెట్లో అందుబాటులో ఉండే అనేక కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటాం. కానీ వాటి వల్ల జుట్టు నెరిసే, రాలిపోయే అవకాశం ఉంటుంది. రైస్ వాటర్‌ను జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టు నెరవకుండా, రాలకుండా (Hair Care Tips) నివారించవచ్చు. పొడి జుట్టు సమస్యకు కూడా రైస్ వాటర్ మంచి ఫలితాలనిస్తుంది. రైస్ వాటర్‌లో ఉండే బీ, సీ, ఇ విటిమన్లు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. నిల్వ ఉంచిన రైస్ వాటర్‌లో యాంటీ ఫంగల్ ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును నివారించగలవు.
Also Read: Virat Kohli: 'కోహ్లీ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం మంచి పరిణామమే.. ఇకపై చెలరేగుతాడు'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook