Body Pains: ఇలా చేస్తే భుజం, మెడ, వెన్నునొప్పిల నుంచి తక్షణ ఉపశమనం..

Shoulder, Neck, Back And Cervical Pain: ప్రస్తుతం చాలా మందిలో భుజం, మెడ, వెన్నునొప్పిలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు ఈ కింది వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ టిప్స్‌ను కూడా పాటించాల్సి ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2024, 01:20 PM IST
Body Pains: ఇలా చేస్తే భుజం, మెడ, వెన్నునొప్పిల నుంచి తక్షణ ఉపశమనం..

Shoulder, Neck, Back And Cervical Pain: స్త్రీలలో సులభంగా రోగనిరోధక శక్తి తగ్గింపోతుంది. అంతేకాకుండా చాలా మంది రక్తహీనత సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు. దీని కారణంగా మెడ, భుజం, నడుము లేదా గర్భాశయంతో నొప్పులు వస్తాయి. తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, నిద్రపోవడం, కూర్చోవడం, సరైన పద్ధతిలో కూర్చోకపోవడం కారణంగా చాలా మందిలో శరీరంలో వివిధ భాగాల్లో నొప్పులు వస్తున్నాయి. అంతేకాకుండా దీని కారణంగా కొంతమందిలో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన యోగాసనాలు ప్రతి రోజు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

తీవ్రంగా భుజం, మెడ, వెన్నునొప్పిలు రావడానికి కారణాలు:
కండరాల్లో తీవ్ర ఒత్తిడి
గర్భాశయ పగులు
గర్భాశయ స్టెనోసిస్ కారణంగా 
గుండెపోటు సమస్యలు
ఊపిరితిత్తుల క్యాన్సర్

వ్యాయామాలతో చెక్‌ పెట్టొచ్చు:
భుజాల వ్యాయామాలు:

తరచుగా కొంతమంది స్త్రీలలో గర్భాశయ నొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం రెండు భుజాలను వెనక్కి తీసుకుంటూ ఆపై మెడలను బాగా తిప్పాల్సి ఉంటుంది. దీంతో పాటు మెడను 10 నుంచి 20 సార్లు  ఎడమ వైపు నుంచి కుడికి తిప్పాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ శ్వాసను ఒదులతూ పిలుస్తూ ఉంటే సులభంగా శరీరంలోని అన్ని నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

వైపు భ్రమణం ఆసనం:
ఈ ఆసనాన్ని వేయడానికి ముందుగా నడుమును నిటారుగా ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత  మెడ, భుజాల వైపు సాగుతూ ఉన్నట్లు అనిపించేంత వరకు మీ హెడ్‌ను ముందుకూ వెనకకు అటూ ఇటూ తిప్పాల్సి ఉంటుంది. ఇలా రోజు 1 నుంచి 2 నిమిషాలు చేస్తే బాడీలోని అన్ని పెయిన్స్‌ సులభంగా దూరమవుతాయి.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా? 

ఇలా కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు:
మెత్తగా ఉండే దిండును వినియోగించాలి.
అతిగా నిద్రపోవడం మానుకోవాల్సి ఉంటుంది.
స్లీపింగ్ పొజిషన్స్‌ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.
మంచి ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం చాలా మంచిది.
జీవనశైలిలో మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News