Side Effects of Bananas: అరటి పండు తింటే ఆరోగ్యానికి మంచిది అనే భావన ఉంది. అవును, అరటి పండు ఆరోగ్యానికి పలు విధాల మంచిదే. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఆరోగ్య రీత్యా కొన్నిరకాల పరిస్థితుల్లో అరటి పండు కూడా ఆరోగ్యానికి హానీ చేస్తాయి అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ అరటి పండు తింటే వచ్చే ఆ ఇబ్బందులు ఏంటో, ఎందుకు తెలియాలంటే మనం ఇంకొంచెం డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
అధిక బరువు తగ్గించుకునేందుకు డైట్ అనుసరిస్తున్న వారు అరటి పండు అసలే తినొద్దు. ఎందుకంటే అరటి పండు తినడం వల్ల బరువు తగ్గకపోగా ఇంకా బరువు పెరుగుతారు. ఈ విషయం తెలియక అరటి పండు తినడం వల్ల బరువు తగ్గడం కోసం మీరు చేసే ఇతర శ్రమ, డైటింగ్ అంతా వృధా అవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి బదులుగా ఇంకా బరువు పెరుగుతున్నాం అనే ఆందోళన మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.
ఆకు పచ్చ రంగులో ఉన్న ఆరటి పండ్లను కానీ లేదా మగ్గనటువంటి అరటి పండ్లను కానీ తినొద్దు. ఎందుకంటే, ఆకుపచ్చ వర్ణంలో ఉండే అరటి పండ్లలో, అలాగే సరిగ్గా పండనటువంటి అరటి పండ్లలో అధిక కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. హై కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారం వల్ల మలబద్ధకం సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
అరటి పండ్లను ఎక్కువ మోతాదులో తినడం వల్ల శరీరం అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. పొట్టలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. దీనికి కారణం అరటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటమే. ఫైబర్ అధికమోతాదులో ఉన్న అరటి పండ్లను ఇంకా అధిక మోతాదులో తీసుకోవడం వల్లే తలెత్తే ఇబ్బంది ఇది.
అరటి పండ్లలో సహజంగానే అధిక మోతాదులో చక్కర ఉంటుంది. అరటి పండు ప్రకృతి సిద్ధమైన తీపి పదార్థం. అందుకే అరటి పండ్లను ఎక్కువగా తింటే అందులో ఉండే హై షుగర్ మీ దంతాల్లో కేవిటీ వచ్చేందుకు కారణం అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
అరటి పండ్లు జీరో ఫ్యాట్ పుడ్ అంటారు. అవును, అరటి పండ్లలో ఫ్యాట్ ఏమాత్రం ఉండదు. అంటే అరటి పండ్లు తినడం వల్ల ఎలాంటి ఫ్యాట్ రాదు. కానీ మనిషి శరీరానికి తగిన మోతాదులో హెల్తీ ఫ్యాట్స్ అనేది కచ్చితంగా అవసరం అనే విషయం కూడా తెలుసుకోవాలి.
బనానా డైట్ అనుసరిస్తున్న వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. వారు తమ శరీరంలోని అవయవాలు అన్ని విధాల పనిచేసేందుకు అవసరమైన ప్రోటీన్ ఇవ్వలేకపోతున్నారు అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది.