Side Effects of Drinking Cool Drinks: కొంతమందికి కూల్ డ్రింక్స్ తాగడం అంటే ఒక వీక్ పాయింట్. కూల్ డ్రింక్ తాగకుండా వారికి రోజు గడవదు. ఇంకొంతమంది రోజూ తాగకపోయినా.. తరచుగా అధిక మోతాదులో కూల్ డ్రింక్స్ తాగుతూ ఒకేసారి హెవీ డోస్ కవర్ చేస్తుంటారు. అలా కూల్ డ్రింక్స్ తాగేవాళ్లంతా తాము తాగేది సాఫ్ట్ డ్రింక్స్ కోవలోకే వస్తాయి కానీ ఆల్కహాల్ కాదు కనుక ఏం కాదులే అనే అనుకుంటారు. కానీ తమకు తెలియకుండానే తాము కూడా తప్పు చేస్తున్నాం అని తెలుసుకోలేరు. తప్పు చేస్తున్నాం అని తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎందుకంటే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు పెరగడం :
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారు అధిక బరువు పెరిగే ప్రమాదం కూడా అంతే ఎక్కువగా ఉంది. అందుకు కారణం కూల్ డ్రింక్స్ లో తీపి రుచి కోసం అధిక మోతాదులో చక్కర వినియోగించడమే. ఎంత ఎక్కువ స్వీట్ కంటెంట్ తీసుకుంటే అంత ఎక్కువ బరువు పెరగడం జరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకే తరచుగా కూల్ డ్రింక్స్ తాగే వారు అధిక బరువు పెరగడం జరుగుతుంది.
రోగ నిరోధక శక్తి తగ్గడం :
అధికంగా కూల్ డ్రింక్స్ తాగేవారిలో రోగ నిరోధక శక్తి కూడా నశిస్తుంది అని అనేక అధ్యయనాల్లో తేలింది. కూల్ డ్రింక్స్ లో ఉండే హానికరమైన పదార్థాలు, రసాయనాలే అందుకు కారణం అని న్యూట్రిషనల్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
తొలనొప్పి :
కూల్ డ్రింక్స్‌లోనూ కెఫైన్ ఉంటుంది. తక్కువ మోతాదులో అప్పుడప్పుడు తీసుకుంటే మెదడును ఉత్తేజితం చేసే ఇదే కెఫైన్.. రెగ్యులర్‌గా కానీ లేదా అధిక మోతాదులో కానీ తీసుకునే వారిలో తలనొప్పికి దారి తీస్తుంది.
పొట్టలో ఉబ్బరం :
కూల్ డ్రింక్స్ కిక్ ఇవ్వడం కోసం ఉపయోగించే గ్యాస్‌తో పాటు ఆ డ్రింకుని ప్రిజర్వ్ చేయడం కోసం ఉపయోగించే కెమికల్స్ వినియోగం వల్ల కొంతమందికి కూల్ డ్రింక్స్ తాగాకా పొట్టలో ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇంకొంతమందికి అది పొట్టలో మంటగానూ అనిపించే లక్షణాలు కూడా కనిపిస్తాయి.
పుప్పి పళ్లు :
కూల్ డ్రింక్స్ తాగితే అధిక బరువు పెరగడానికి ఏదైతే కారణం అవుతుందో... అలాగే దంతాలు పుచ్చిపోవడానికి కూడా అదే కారణం అవుతోంది. ఔను కూల్ డ్రింక్స్ తాగేవారిలో పుప్పి పళ్ల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి : Black Coffee Health Benefits: బ్లాక్ కాఫీతో శరీరానికి కలిగే లాభాలు
గుండెలో మంట :
రెగ్యులర్‌గా కూల్ డ్రింక్స్ తాగేవారికి గుండెలో మంటగా అనిపించడం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కిందకే వస్తాయి.
ఇది కూడా చదవండి : Side Effects of Green Tea: గ్రీన్ టీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్.. గ్రీన్ టీతో వచ్చే అనారోగ్య సమస్యలు
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించడానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి