Stomach Pain: కడుపునొప్పి ఓ సాధారణ సమస్య అయినప్పటికీ ఇది తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కడుపునొప్పి వల్ల అజీర్ణం గ్యాస్ గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ సమస్య నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపశమనం పొందడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కడుపునొప్పి వల్ల అల్సర్లు, హెర్నియా వంటి తీవ్రవ్యాధులకు దారి తీసే అవకాశాలు. కాబట్టి కడుపునొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేదనకునుడు సూచించిన ఈ చిట్కాలను వినియోగించండి.
ఇంట్లో ఉండే పదార్థాలతో కడుపునొప్పి మటు మాయం:
అల్లం నీరు:
అల్లం లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి అల్లాని నీటిలో ఉడకబెట్టి.. అందులో తేనె వేసి కలుపుకొని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా కడుపునొప్పి పొట్టలో అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు సులభంగా తగ్గుతాయి. ఈ ఔషధ గుణాలున్న రసాన్ని ప్రతిరోజు రెండుసార్లు తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
సోంపు నీరు:
పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా సోంపు నీరును తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది భారతీయులు అజీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సోంపును వినియోగిస్తారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు అందజేయడమే కాకుండా కడుపునొప్పి నుంచి కడుపునొప్పి నుంచి 20 నిమిషాల్లో ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి సోంపు నీటిని ప్రతిరోజు రెండుసార్లు తాగాల్సి ఉంటుంది.
ఇంగువ నీరు:
ఆహారం రుచిని పెంచేందుకు ఇంగువ సహాయపడుతుంది. అయితే పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ ఇంగువ ప్రభావంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అజీర్ణం కడుపునొప్పి గ్యాస్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. ఇంగువను గ్లాసేడు నీటిలో కలుపుకుని తాగితే పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Pak Vs Eng: పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో కలకలం.. 14 మంది ఆటగాళ్లకు అస్వస్థత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook