Blood Pressure: ఈ 5 జ్యూసులు తాగండి.. మీరు బీపీ చెక్ చేసుకోవాల్సిన అవసరమే లేదట..

BP Controlling Drinks: బీపీ కూడా చాలామందికి మనం చూస్తాం. బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ రోగాలన్ని ఒక్కసారి వస్తే జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. సరైన డైట్‌ ద్వారా వాటిని మనం నియంత్రిస్తూ ఉండాలి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 3, 2024, 03:01 PM IST
Blood Pressure: ఈ 5 జ్యూసులు తాగండి.. మీరు బీపీ చెక్ చేసుకోవాల్సిన అవసరమే లేదట..

BP Controlling Drinks: బీపీ కూడా చాలామందికి మనం చూస్తాం. బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ రోగాలన్ని ఒక్కసారి వస్తే జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. సరైన డైట్‌ ద్వారా వాటిని మనం నియంత్రిస్తూ ఉండాలి. ఈరోజు బీపీ ఎప్పటికీ పెరగనివ్వకుండా కాపాడే 5 హెల్తీ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.

బీట్‌ రూట్‌ జ్యూస్..
బ్రిటిష్ హార్ట్‌ ఫౌండేషన్ క్వీన్ మేరీ యూనివర్శిటీ లండన్ నివేదిక 2015 ప్రకారం ప్రతిరోజూ 250 ఎంఎల్ బీట్‌ రూట్ జ్యూస్‌ తాగితే హైపర్టెన్షన్ సమస్యను క్రమంగా తగ్గిపోతుంది. కొన్ని నివేదికలు ప్రతిరోజూ రెండు కప్పులు బీట్‌ రూట్ జ్యూస్‌ తాగవచ్చని సూచించాయి. బీట్‌ రూట్‌ లో నైట్రిక్‌ ఆక్సైడ్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్‌ లోకి కలిపి బీపీ స్థాయిలను తగ్గిస్తాయి. బీట్‌ రూట్‌ జ్యూస్‌ తో కలిపి ఏ ఇతర జ్యూసులు తాగిన మంచి హైడ్రేటింగ్‌ డ్రింక్‌ గా పనిచేస్తుందట.

మందార టీ..
మందారంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మందార టీ ని మీ డైట్లో చేర్చుకోండి. దీన్ని మందారపూలను ఎండబెట్టి తయారు చేస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు నాళాల్లోకి కలిపిపోయి రక్తపోటును తగ్గిస్తాయి. ఒక నివేదిక ప్రకారం మందార టీ తాగడం వల్ల బీపీ త్వరగా నియంత్రణలోకి వస్తుందని 2015  అధ్యయనం తెలిపింది. వేడినీటిలో మందార ఆకులను కూడా వేసి ఉడికించుకుని తాగవచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ఇదీ చదవండి: అటుకులతో ఆరోగ్యం.. అల్పాహారంగా తింటే 10 నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..

యాపిల్ జ్యూస్..
ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే వైద్యులను కలవాల్సిన అవసరం ఉండదని అంటారు. ఇది రక్తపోటు సమస్యకు కూడా చెక్ పెడుతుంది. యాపిల్ జ్యూస్‌లో పాలిఫెనల్స్, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఫ్లెవనాయిడ్స్ రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి. యాపిల్లోని పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఇది రక్తపోటును నిర్వహిస్తుంది.

దానిమ్మ జ్యూస్..
దానిమ్మలో విటమిన్ సీ, పొటాషియం, ఫోలేట్‌ వంటి న్యూట్రియేంట్లతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇందులోని ఆంథోసైనాన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ కంటెంట్‌ బీపీని తగ్గిస్తాయి. బీపీతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా నియంత్రించే గుణం దానిమ్మకు ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మన శరీరంలోని ఆక్సిడెటీవ్ స్ట్రెస్ ను నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తి చేస్తు తగ్గిస్తుంది.

ఇదీ చదవండి: విటమిన్ B12 లోపిస్తే ఈ లక్షణాలు కాళ్లలో కనిపిస్తాయి? 

గ్రీన్ టీ..
గ్రీన్‌ టీ తాగడం వల్ల కూడా మన శరీరంలో బ్లడ్‌ ప్రెజర్ తగ్గిస్తుంది. ఇది ప్రత్యేకంగా హైపర్‌ టెన్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లను క్యాటెచిన్ అంటారు. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. ఒక నివేదిక ప్రకారం గ్రీన్ టీ రెగ్యులర్‌ గా తీసుకోవడం వ్లల బీపీ డయాస్టాలిక్, సిస్టాలిక్ రెండు స్థాయిలను తగ్గిస్తుందట. ప్రతిరోజూ 3 కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News