Uses Of Sandalwood: వేసవికాలంలో చాలా మంది వదదెబ్బ, కఫం, అలసట, దాహం, చర్మం సమస్యలు వంటి ఆర్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తెల్లగంధం ఎంతో ఉపయోగపడుతుంది. తెల్ల చందనం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
తెల్ల గంధంలో యాంటీసెప్టిక్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మ సమస్యలను తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతాయి. దీని వల్ల కలిగే ఇతర లాభాలు గురించి తెలుసుకుందాం.
తెల్ల గంధంతో కలిగే ఉపయోగాలు:
వేసవిలో చాలా మంది సన్‌బర్న్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకుంటే తెల్ల గంధంను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని వల్ల వాపు, మంటలు తగ్గుతాయి. తెల్ల గంధం పొడిని ఒక కప్పులో తీసుకొని అందులో నీటిని కలుపుకొని పేస్ట్ చేసుకోవాలి. దీని శరీరానికి అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ తెల్ల గంధం చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీబయాటిక్ లక్షణాలు ముఖంపై కలిగే మొటిమలను , మచ్చలను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. దీని కోసం మీరు ఒక గిన్నెలో పెరుగు లేదా పాలు తీసుకోవాలి. ఇందులో తెల్ల గంధం కలుపుకొని ముఖానికి ప్యాక్‌గా వేసుకోవాలి.
తెల్ల గంధంలో రోజ్ వాటర్ లేదా పాలను కలుపుకోవడం వల్ల ముఖానికి పట్టించాలి. దీని వల్ల ముడతలు, మచ్చలు కలగకుండా ఉంటాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. కొంతమంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యల కూడా తెల్ల గంధం పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు చర్మంపై కలిగే దురదలను తొలగిస్తుంది. దీని కోసం మీరు చందనను నీటిలో కలుపుకోని పేస్ట్‌గా చేసుకోవాలి. దురద ఉన్న చోట ఈ పేస్ట్‌ను ఆప్లై చేయాలి.
తెల్ల గంధం చర్మం రంధ్రాలను కుదించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. చందన పొడి గులాబీ నీటితో కలిపి ముఖానికి టోనర్‌గా సహాయపడుతుంది.
చందన చూర్ణం వాడేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి:
* మీకు ఏదైనా చర్మ సమస్యలు ఉంటే చందన వాడే ముందు వైద్యుడిని సంప్రదించండి.
* తెల్ల గంధం మీ ముఖానికి అప్లై చేసే ముందు మీ మోచేయిలోని చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయండి.
* తెల్ల గంధం కళ్ళకు దగ్గరగా ఉపయోగించవద్దు.
* తెల్ల గంధం చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.
తెల్ల గంధం ఒక వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అయితే దీని ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి