Monsoon Season: కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనే వర్షాకాలం (monsoon) కూడా ప్రారంభమైంది. ఈ కాలంలో మనకు కొంత ఉల్లాసంగా ఉంటుంది కానీ.. సీజనల్ వ్యాధులు మనల్ని నిద్రపోకుండా చేస్తాయి. ఈ కాలంలో సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోతే.. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు కూడా సీజనల్ వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా ఈ వాతావరణంలో మురుగు నీటికి, అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. వ్యాధుల బారిన పడకుండా మన ఆహారపు అలవాట్లే కాపాడుతాయి. ప్రధానంగా బయటి ఆహారాన్ని తినడం మానుకోని ఇంట్లో తయారు చేసిన వేడివేడి ఆహారాన్ని తింటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. Also read: coronavirus: మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టండి
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకోని తినడం వల్ల కరోనా వైరస్ మహమ్మారి, సీజనల్ వ్యాధులను దాదాపు మీ దరికి చేరకుండా చేసుకోవచ్చు.
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ ఆహార దినుసులు, కూరగాయలు ఎంతమేర మనకు దోహద పడతాయో ఇప్పుడు చూద్దాం..
అల్లం-వెల్లుల్లి
ప్రతి సీజన్‌లో అల్లం-వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండటానికి ఔషధంలా పనిచేస్తాయి. ఇది క్లినికల్‌లో కూడా తేలింది. వర్షాకాలంలో వీటిని తినడం వల్ల ప్రతీఒక్కరూ సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సంసిద్ధమైనట్లే. అయితే వెల్లుల్లి ముఖ్యంగా అంటువ్యాధులతో పోరాడటానికి, మంటను తగ్గించడానికి, ఆక్సీడేటివ్ స్ట్రేస్ (ఆక్సీకరణ ఒత్తిడి)ని తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. Also read: Coronavirus: గాలితో కూడా కరోనా: WHO
నిమ్మకాయ
నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయల్లో ఉన్న ‘విటమిన్ సీ’ అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తూ కవచంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా అమితంగా పెరుగుతుంది. Also read: Mustard Oil Benefits: ఆవ నూనెతో గుండెకు మేలు.. మరెన్నో ప్రయోజనాలు
పసుపు
పసుపును క్రమం తప్పకుండా ఆహారంలో, పాలతో తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడటంతోపాటు.. మానసిక స్థితిని అదుపులో ఉండేలా చేస్తుంది. పసుపు వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
హెర్బల్ టీ, కషాయాలు
వర్షా కాలంలో మీ రోగనిరోధక శక్తిని మరింత శక్తివంతంగా మెరుగుపర్చుకోవడానికి హెర్బల్ టీ లేదా కషాయాలను క్రమం తప్పకుండా తాగాలి. దీనికోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, నల్ల ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసం, తేనె కలుపుకోని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు.
ఆకు కూరలు
పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి దోహదపడతాయి. ఆకు కూరలు తినడం వల్ల తరచూ అనారోగ్యానికి గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు