Best Eye Care Tips: సర్వేంద్రియానం నయనం ప్రదానం అన్నారు పెద్దలు. మనిషి జీవితంలో కంటిచూపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అదే లేకుంటే అంతా అంధకారమే. అసలు కంటిచూపు మెరుగుపర్చుకునేందుకు పాటించాల్సిన హెల్త్‌టిప్స్ ఏంటనేది తెలుసుకుందాం..

ఆధునిక జీవితంలో కంటి చూపు(Eye Sight) సమస్యలు అధికంగా ఉంటున్నాయి. రోజువారీ జీవితం, ఆధునిక ఆహారపు అలవాట్ల నేపధ్యంలో కంటి చూపుపై ప్రభావం పడుతోంది. మరోవైపు కంప్యూటర్ స్క్రీన్స్, స్మార్ట్‌ఫోన్ వినియోగం వంటివి ముఖ్య కారణాలుగా ఉన్నాయి. ప్రధానంగా వయస్సు మీద పడకపోయినా.. జీవనశైలిలో వస్తున్న మార్పులతో చిన్న వయస్సులోనే కంటి చూపుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మారుతున్న జీవనశైలి ప్రకారం.. కంటి సంరక్షణ కోసం మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. ఈ ఆహారాలు కంటి సమస్యలను దూరం చేసి మంచి కాంతిని అందించడంలో సహాయపడతాయి. కంటి సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం.. ఆహారంలో ఏయే పదార్థాలు చేర్చుకోవాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను తొలగించడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. ఆకుకూరలు.. మాక్యులర్ డీజనరేషన్, కంటిశుక్లం లాంటి సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించి మీ కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇక రెండవది డ్రై ఫ్రూట్స్. ఇవి రుచితో పాటు రోగనిరోధకశక్తిని(Immunity Power) అందిస్తాయి. అంతేకాకుండా కంటిచూపును మెరుగు పరుస్తాయి. కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

ఇక మూడవది నారింజ. కంటికి సంబంధించిన చాలా సమస్యలను నారింజలు దూరం చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలతో పోరాడి కంటి చూపును వృద్ధి చేస్తాయి. నారింజ రెటీనాకు అవసరమయ్యే విటమిన్ ఎ అందిస్తాయి.

నాలగవది చిలకడ దుంపలు. ఇవి కూడా కంటి చూపును మెరుగుపరుస్తాయి. శరీరాన్ని ఉత్తేజపర్చడంతోపాటు వాపును తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.

ఇక ఐదవది పొద్దుతిరుగుడు విత్తనాలు(Sun Flower Seeds). ఇవి ఆరోగ్యాన్ని కాపడటంతోపాటు.. కళ్ళకు కూడా చాలా పోషకాలను అందిస్తాయి. పొద్దు తిరుగుడు విత్తనాలలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీవక్రియ వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి. కళ్ళకు మెరుగైన దృష్టిని అందిస్తాయి.

ఇక ఆరవది మిరపకాయ. ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. రెడ్ క్యాప్సికమ్‌లో ఎ, సి,ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మిరపకాయలతో కళ్లకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇవి కంటికి ఎలాంటి ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరగకుండా నిరోధిస్తాయి. దీంతోపాటు రెటీనాను ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇక చివరిది క్యారెట్ రసం. క్యారెట్ జ్యూస్ కంటికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్(Carrot Juice) తాగితే చాలా మంచిది. ఇది కంటికి సంబంధించిన అనేక రకాల వ్యాధులను దూరం చేస్తుంది.

Also read: Covaxin Approval: కోవాగ్జిన్‌ను గుర్తిస్తున్నట్టు ప్రకటించిన యూకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

English Title: 
Top 7 health habbits to make your eye healthy and more powerful
News Source: 
Home Title: 

Best Eye Care Tips: కంటిని ఆరోగ్యంగా ఉంచే ఏడు ఆహారపు అలవాట్లు ఇవే

Best Eye Care Tips: కంటిని ఆరోగ్యంగా ఉంచే ఏడు ఆహారపు అలవాట్లు ఇవే
Caption: 
Eye Care ( file photo)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Best Eye Care Tips: కంటిని ఆరోగ్యంగా ఉంచే ఏడు ఆహారపు అలవాట్లు ఇవే
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Thursday, November 11, 2021 - 14:08
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
83
Is Breaking News: 
No

Trending News