White Hair Problem: వైట్ హెయిర్ సమస్యకు కారణం ఇదే, ఈ విటమిన్ లోపం లేకుండా చూసుకోండి

White Hair Problem: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో ప్రధానమైంది హెయిర్ ఫాల్, జుట్టు తెల్లబడటం. తక్కువ వయస్సుకే వైట్ హెయిర్ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు ప్రధాన కారణం శరీరంలో ఆ విటమిన్ లోపించడమే అంటున్నారు వైద్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 10, 2024, 05:48 PM IST
White Hair Problem: వైట్ హెయిర్ సమస్యకు కారణం ఇదే, ఈ విటమిన్ లోపం లేకుండా చూసుకోండి

White Hair Problem: బిజీ లైఫ్, మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ కారణంగా వృద్ధాప్యంలో నెరవాల్సిన జుట్టు ముందే తెల్లగా మారిపోతోంది. ఇటీవలి కాలంలో వైట్ హెయిర్ సమస్య అధికంగా కన్పిస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం యువతను ఎక్కువగా వేధిస్తున్న సమస్యల్లో వైట్ హెయిర్ ముఖ్యమైందిగా తెలుస్తోంది. మరి ఈ సమస్యకు కారణమేంటి, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలనేది తెలుసుకుందాం.

వైట్ హెయిర్ అంటే సాధారణంగా 50 ఏళ్లు దాటినవారిలో కన్పించేది. క్రమంగా ఇది 40 ఏళ్ల వయస్సువారికి కూడా సంక్రమించేసింది. ఇప్పుడు ఏకంగా 25-30 ఏళ్ల వయస్సువారిలో కూడా వైట్ హెయిర్ ప్రధాన సమస్యగా మారిపోయింది. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రీ మెచ్యూర్ వైట్ హెయిర్‌కు కారణం విటమిన్ సి లోపమని తెలుస్తోంది. ఇదొక్కటే కారణం కాకపోవచ్చు ఇంకా ఇతర కారణాలు కూడా ఉంటాయి. కానీ విటమిన్ సి లోపం ప్రధానం కారణమని అంటున్నారు. విటమిన్ సి లోపముంటే కచ్చితంగా వైట్ హెయిర్ సమస్య రావచ్చంటున్నారు. ఇది జుట్టును నెరవకుండా కాపాడటమే కాకుండా హెయిర్ ఫాల్ సమస్యను కూడా దూరం చేస్తుంది. అంటే విటమిన్ సి లోపం లేకుండా చేసుకుంటే అటు వైట్ హెయిర్ ఇటు హెయిర్ ఫాల్ రెండు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

శరీరంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదపడేది విటమిన్ సి. జుట్టు తెల్లబడకుండా నియంత్రించేది ఇదే. కొలాజెన్ కారణంగానే కేశాలు పటిష్టంగా మారతాయి. జుట్టు నిర్జీవంగా మారకుండా ఉంటుంది. అందుకే కేశ సంరక్షణకు విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోమని సూచిస్తుంటారు. విటమిన్ సి అనేది ఎక్కువగా పండ్లు, కూరగాయల్లో ఉంటుంది. రోజూ కనీసం  4 గ్రాముల పోషకాలు తీసుకుంటే తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో కేశ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

శరీరంలో విటమిన్ సి లోపం లేకుండా ఉండాలంటే ఆరెంజ్, జామ, నేరేడు, బొప్పాయి, నిమ్మ, కూరగాయలు, ఆపిల్, దానిమ్మ తప్పకుండా తినాలి. కూరగాయల్లో అయితే కాలిఫ్లవర్, బ్రోకలీ, పాలకూర, టొమాటో మంచి ప్రత్యామ్నాయాలు. విటమిన్ సి ఒక్కటే కాదు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నంతవరకూ కేశాలకు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. 

Also read: Diabetic Precautions: చలికాలంలో డయాబెటిక్ రోగులు ఈ పొరపాట్లు చేయకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News