Weight Loss Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా సులభంగా 12 రోజుల్లో బెల్లీ ఫ్యాట్, బరువుకు చెక్‌ పెట్టండి..

Weight Loss Tips: చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల బరువు పెరుగుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కింద పేర్కొన్న పలు రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 04:45 PM IST
  • బ్రోకలీ, కాలే ఆకులు, మునగ ఆకు..
  • పాలకూర ఆహాంలో తీసుకుంటే కేవలం 12..
  • రోజుల్లో బెల్లీ ఫ్యాట్, బరువు తగ్గుతారు.
Weight Loss Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా సులభంగా 12 రోజుల్లో బెల్లీ ఫ్యాట్, బరువుకు చెక్‌ పెట్టండి..

Weight Loss Diet: పెరుగుతున్న బరువును నియంత్రించడం అంత సులభం కాదు. ఇందుకోసం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా కఠినతర వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడానికి కారణాలు స్వీట్లు, జంక్ ఫుడ్‌లు అతిగా తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బరువు పెరగడం వల్ల చాలా రకాల శరీర ఇబ్బందులు రావొచ్చు. కాబట్టి తప్పకుండా బరువును నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అయితే బరువు తగ్గడానికి శరీరానికి అవసరమైన ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

మునగ ఆకు కూరను తినండి:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ ఆకు కూరను క్రమం తప్పకుండా తీసుకుంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయి తగ్గి మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకుల్లో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం లభిస్తాయి.

కాలే ఆకులు:
శరీరానికి కాలే ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. కాలేలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే..బరువును సులభంగా తగ్గిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా అధిక పరిమాణంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

బ్రోకలీ:
బ్రోకలీలో ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్యలు కూడా దూరమవుతాయి. ఆయితే చాలా మంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బ్రోకలీ ఆహారంలో తీసుకోవాలి.

పాలకూర:
బచ్చలికూర చాలా మంది దీనిని తినేందుకు ఇష్టపడరు. అయితే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి పాలకూరను క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుందని నిపుణలు చెబుతున్నారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారు క్రమం తప్పకుండా ఈ పాలకూరను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారం ఆధారంగా అందించబడింది. ఇది నిపుణుల అభిప్రాయం కాదు. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Halloween stampede: హీరోయిన్ దెబ్బకు 149 మంది మృతి.. వందల మంది ఆసుపత్రి పాలు!

Also Read: Varasudu Business Details: షాకిస్తున్న వారసుడు బిజినెస్ డీటైల్స్.. ఎన్ని కోట్లకు అమ్మారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News