Back Pain: నడుము నొప్పి ఎందుకొస్తుంది, కారణాలేంటి, ఎలా దూరం చేసుకోవచ్చు

Back Pain: దైనందిన జీవితంలో ఎన్నో ఆనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందులో ప్రధానమైంది నడుము నొప్పి. నడుము నొప్పి ఉంటే ఏ పనీ చేయలేని పరిస్థితి. ఆసలీ నడుము నొప్పి ఎందుకొస్తుందనేది తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2022, 08:49 AM IST
Back Pain: నడుము నొప్పి ఎందుకొస్తుంది, కారణాలేంటి, ఎలా దూరం చేసుకోవచ్చు

Back Pain: దైనందిన జీవితంలో ఎన్నో ఆనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందులో ప్రధానమైంది నడుము నొప్పి. నడుము నొప్పి ఉంటే ఏ పనీ చేయలేని పరిస్థితి. ఆసలీ నడుము నొప్పి ఎందుకొస్తుందనేది తెలుసుకుందాం.

మనిషి అవయవాల్లో అన్నింటికీ ఆధారం నడుము. పడుకోవాలన్నా, కూర్చోవాలన్నా..నిలుచుని ఉండాలన్నా నడుం కీలకాధారమే. అయితే ఇటీవల నడుము నొప్పి పెద్ద సమస్యగా మారుతోంది. నడుము నొప్పి ఉంటే ఏ పనీ సరిగ్గా చేయలేం. కూర్చోలేం..నిలుచుని ఉండలేం. శరీరంలో అత్యంత కీలకమైన భాగమిది. ముప్పై మూడు వెన్నుపూసలతో తయారైన ఎముక ఇది. మనం నిలుచున్నప్పుడు లేదా వంగినప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఏ భంగిమలో ఉన్నా సరే వెన్నుముకలో ఉండే డిస్క్‌లు సహాయపడతాయి. 

నడుము ప్రాంతంలో(Back Pain)ఉండే డిస్క్‌లు అరిగిపోవడం లేదా పక్కక తొలగడం వల్ల నడుము నొప్పి వస్తుంటుంది. వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌లో మార్పు వల్ల నడుము నొప్పి తలెత్తుతుంది. కార్టిలేజ్ క్షీణించడం లేదా ఆప్టియోఫైట్స్ ఏర్పడటం వల్ల నడుము నొప్పి సమస్యగా మారుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వెన్నుముక (Spinal Card) చివరి భాగం అరిగిపోవడం వల్ల నడుము నొప్పి వస్తుంది. ఇంకా చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా టీబీ, కేన్సర్ వంటి వ్యాధులు కూడా వెన్నుపూస అరిగిపోవడానికి దారి తీస్తాయి. 

నడుము నొప్పి తీవ్రమైనప్పుడు ప్రతి పనిలోనూ ఇబ్బంది కలుగుతుంది. కూర్చోవడం, నిలుచుని ఉండటం, వంగడం అన్నీ కష్టంగా మారుతాయి. మహిళలలైతే వంట చేసుకోలేరు. మహిళలు చాలామంది హై హీల్స్ చెప్పల్స్ వాడుతుంటారు. ఇది కూడా నడుము నొప్పికి కారణమౌతుంది. ఆధునిక జీవనశైలి తీసుకొస్తున్న ఉద్యోగాలు కూడా నడుము నొప్పికి కారణాలుగా మారుతున్నాయి. కంప్యూటర్ ముందు లేదా ల్యాప్‌టాప్ ముందు గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల నడుము నొప్పి వస్తుంది. మనిషి శరీరంలో అసహజ కదలికల వల్ల కూడా నడుము నొప్పి బాధిస్తుంది. గతంలో నడుము నొప్పి ఉంటే..వయస్సు మళ్లినవారిలో ఎక్కువగా కన్పించేది. ఇప్పుడు మాత్రం యుక్త వయస్సులోనే ఎక్కువగా కన్పిస్తోంది. 

అందుకే కొన్ని చిట్కాలతో (Health tips to check Back Pain) నడుము నొప్పి దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. నడుము నొప్పి సమస్యతో బాధపడేవారు గంటల తరబడి కూర్చునే అలవాటు మానుకోవాలి. ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ముందు నుంచి మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. కూర్చునే భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. వీపును వీలైనంతవరకూ నిటారుగా బ్యాక్ సపోర్ట్‌తో ఉండేట్టు చూసుకోవాలి. నడుము నొప్పి సమస్య ఉన్నవారు పరుపుపై కంటే..బల్లపై లేదా నేలపై పడుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. 

Also read: APPLES: ఆపిల్ పండ్లతో అనారోగ్య సమస్యలా..హానికారక బ్యాక్టీరియా కారణమా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News