Vitamin B12: విటమిన్ బి12 లోపముంటే శరీరంలో ఏమౌతుంది, ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి

Vitamin B12: శరీర నిర్మాణం, ఎదుగుదలకు వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. ఇందులో విటమిన్లు, మినరల్స్ పాత్ర కీలకం. అన్ని రకాల విటమిన్లు తగిన మోతాదులో ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 24, 2024, 08:21 PM IST
Vitamin B12: విటమిన్ బి12 లోపముంటే శరీరంలో ఏమౌతుంది, ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి

Vitamin B12: శరీరానికి కావల్సిన విటమిన్లలో కీలకమైంది విటమిన్ బి12. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చేయడంలో విటమిన్ బి12 చాలా కీలకమైంది. ఒకవేళ విటమిన్ బి12 లోపిస్తే చాలా వ్యాధులు చుట్టుముడతాయి. విటమిన్ బి12 లోపం అనేది కన్పించినంత తేలికైన అంశం కానే కాదు. నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరంగా మారుతుంది. 

విటమిన్ బి12 చేపట్టనున్న విధుల్లో ముఖ్యమైంది ఎర్ర రక్తకణాల నిర్మాణం, డీఎన్ఏ ఉత్పత్తి వంటివి. అందుకే శరీరానికి కావల్సిన విటమిన్లలో ఇది చాలా ముఖ్యమైంది. ముఖ్యంగా పురుషుల్లో విటమిన్ బి12 లోపం అనేది చాలా సమస్యలకు కారణమౌతుంది. విటమిన్ బి12 పురుషుల్లో ఎందుకు లోపిస్తుంది, ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి వంటి వివరాలు తెలుసుకుందాం. 

విటమిన్ బి 12 లోపంతో కన్పించే సమస్యలు

విటమిన్ బి12 లోపిస్తే తీవ్రమైన అలసట, బలహీనత ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ కొరత ఏర్పడితే శరీరంలోని కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చు. రెడ్ బ్లడ్ సెల్స్ కొరత ఉంటే చర్మం పాలిపోయినట్టు ఉంటుంది. చేతులు, కాళ్లలో తిమ్మిరి కన్పిస్తుంది. జలదరింపు లేదా మంట, కండరాల బలహీనత, నరాల సమస్య రావచ్చు. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపకశక్తి లోపిస్తుంది. మానసిక సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అంతేకాకుండా వికారం, వాంతులు, మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. 

విటమిన్ బి12  అనేది సాధారణంగా మాంసాహారంలో ఎక్కువగా ఉంటుంది. శాకాహారం మాత్రమే తినేవారికి విటమిన్ బి12 కొరత ఏర్పడవచ్చు. కొన్నిరకాల అనారోగ్య సమస్యలు, శస్త్ర చికిత్సల కారణంగా విటమిన్ బి12 సంగ్రహణ తగ్గి లోపం ఏర్పడవచ్చు. మదుమేహం వ్యాధి నియంత్రణకు ఉపయోగించే మెట్‌ఫార్మిన్ , గుండెల్లో మంటకు ఇచ్చే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు విటమిన్ బి12 సరిగ్గా సంగ్రహణ కాకుండా చేస్తాయి.

విటమిన్ బి12 లోపం ఎలా సరిచేయవచ్చు

విటమిన్ బి 12 లోపాన్ని ఎప్పటికప్పుడు రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వివిధ రకాల సప్లిమెంట్లు, ఇంజక్షన్ల రూపంలో చికిత్స అందుబాటులో ఉంది. రోజూ తీసుకునే ఆహారంలో మార్పులు అవసరం. హెల్తీ ఫుడ్స్ మాత్రమే తినాలి. ముఖ్యంగా విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహార పదార్ధాలు డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. 

Also read: Cholesterol Signs: చలికాలంలో కొలెస్ట్రాల్ ముప్పు, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News