PCOD vs PCOS: పురుషులతో పోలిస్తే మహిళలకు అనారోగ్య సమస్యలు ఎక్కువ. ప్రకృతి ధర్మంలో భాగంగా మహిళల్లో ప్రతి నెలా వచ్చే నెలసరి లేదా పీరియడ్స్ కూడా పలు సమస్యలు తెచ్చిపెడుతుంటుంది. ఒక్కోసారి ఇవి భరించలేనంతగా ఉంటాయి. వీటికి తోడు PCOD,PCOS సమస్యలు కూడా బాధిస్తుంటాయి.
PCOD అంటే పోలీసిస్టిక్ ఓవరీ డిసీజ్. PCOS అంటే పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. రెండింటి లక్షణాల్లో తేడా గుర్తించలేకపోవడం వల్ల సమస్య ముదిరిపోతుంటుంది. తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే ముందు ఈ రెండింటికీ ఉన్న అంతరం తెలుసుకోవాలి. సకాలంలో వైద్యుని సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి చేజారిపోవచ్చు.
PCOD అంటే ఏమిటి, లక్షణాలెలా ఉంటాయి
PCOD అనేది మహిళల్లో సంభవించే ఓ సాధారణ సమస్యే. ఈ సమయంలో ఓవరీ అనేది సమయానికి ముందే అండాలు విడుదల చేస్తుంది. ఆ తురవాత సిస్ట్ కింద పరిణమిస్తాయి. బరువు పెరగడం, ఒత్తిడికి లోనవడం, హార్మోనల్ మార్పులు కారణం కావచ్చు. పీసీఓడీ పరిస్థితిలో ఓవరీ సాధారణ పరిమితి కంటే పెద్దదిగా ఉంటుంది. ఈస్ట్రోజన్ అధికంగా విడుదల చేస్తుంది. ఇది కాస్తా ఫెర్టిలిటీపై ప్రభావం చూపిస్తుంది.
శరీరంలో ఎదురయ్యే ప్రతి వ్యాధికి లక్షణాలు తప్పకుండా ఉంటాయి. ఆ లక్షణాల ఆధారంగా వ్యాధిని గుర్తించవచ్చు. పీరియడ్స్ సమయం కంటే ముందు లేదా ఆలస్యంగా వస్తుంటాయి. పీరియడ్స్ తేదీ కచ్చితంగా ఉండకపోవడం పీసీఓడీ లక్షణం కావచ్చు. అందుకే నెలసరి విషయంలో తేడా కన్పిస్తే వైద్యుని సంప్రదించాలి. శరీరంలో ముఖం. కడుపు, వీపుపై కేశాలు రావడం కూడా మరో లక్షణం. అపరిమితంగా బరువు పెరగడం లేదా తగ్గడం పీసీఓడీ లక్షణం. చర్మంపై పింపుల్స్ రావడం, ఆయిల్ పెరగడం మరో లక్షణం. ప్రతి చిన్న పనికీ లేదా ఏం చేయకున్నా అలసట రావడం మరో లక్షణం.
PCOS అంటే ఏమిటి, లక్షణాలెలా ఉంటాయి
PCOS అంటే పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఓ రకంగా డిజార్డర్. పీసీఓడీ ప్రమాదకరం కావచ్చు. ఇందులో మెటబోలిక్, హార్మోనల్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఆ ప్రభావం ప్రెగ్నెన్సీపై పడుతుంది.
పీసీఓడీ వర్సెస్ పీసీఓఎస్ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అందుకే మహిళలు గుర్తించలేకపోతుంటారు. పీసీఓఎస్ ఉంటే పీరయడ్స్ నియంత్రణ లేకుండా ఉంటుంటాయి. అకాలంలో పీరియడ్స్ రావడం లేదా బ్లీడింగ్ ఎక్కువ లేదా తక్కువ ఉండటం కూడా పీసీఓఎస్ లక్షణం. చర్మంపై మచ్చలు ఏర్పడతాయి.
Also read: Healthy Eye Sight: మెరుగైన కంటి చూపు కోసం ఈ ఆహార పదార్థాలు తీసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook