Yoga For Belly Fat: ప్రతి రోజూ ఇలా యోగా చేస్తే కేవలం.. 20 రోజుల్లో పొట్ట చుట్టూ కొవ్వు, బరువును తగ్గిస్తుంది.

Yoga For Weight Loss In 20 Days: ప్రతి రోజూ యోగా ఆసనాలు వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వివిధ రకాల వ్యాధులను కూడా చెక్‌ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యోగా సాధన చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం రెండింటికి ప్రయోజనకరంగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2022, 12:44 PM IST
  • ప్రతి రోజూ షోల్డర్ స్టాండ్ పోజ్‌లో యోగా చేస్తే..
  • కేవలం 20 రోజుల్లో పొట్ట చుట్టూ కొవ్వు..
  • బరువును సులభంగా తగ్గిస్తుంది.
 Yoga For Belly Fat: ప్రతి రోజూ ఇలా యోగా చేస్తే కేవలం.. 20 రోజుల్లో పొట్ట చుట్టూ కొవ్వు, బరువును తగ్గిస్తుంది.

Yoga For Weight Loss In 20 Days: ప్రతి రోజూ యోగా ఆసనాలు వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వివిధ రకాల వ్యాధులను కూడా చెక్‌ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యోగా సాధన చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం రెండింటికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా యోగా చేయుడం వల్ల పెరుగుతున్న బరువును కూడా సులభంగా నియంత్రించవచ్చు. బరువును తగ్గించడమే కాకుండా టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, ఇతర సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అయితే తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా యోగా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ కింద సూచించిన భంగిమ సాధనతో తగ్గించుకోవచ్చు.

మీరు ఇలా సాధనలు  చేస్తే చాలా సులభంగా బరువు పెరుగుతారు:

షోల్డర్ స్టాండ్ పోజ్:
సర్వంగాసన యోగాను షోల్డర్ స్టాండ్ పోజ్ అని కూడా అంటారు. ఈ పోజ్‌తో రోజు వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, శ్వాసకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ, థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలకు చెక్‌ పెడుతుంది. ఇదే క్రమంలో బరువును కూడా సులభంగా నియంత్రిస్తుంది. అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు ఇలా రోజూ చేయాలి.

విరాభద్రసనా భంగిమ సాధన:
విరాభద్రాసన యోగా శరీరానికి కష్టతరమైన ఆసనాలలో ఒకటి. అయితే ఈ సాధనను రోజూ చేయడం వల్ల బరువు తగ్గడమేకాకుండా శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా సులభంగా తగ్గించేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే ఈ సాధనను రోజూ చేయడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ స్థాలను కూడా నియంత్రిస్తుంది. 

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

Also Read: Horoscope Today September 11th 2022: నేటి రాశి ఫలాలు... చంద్ర బలంతో ఈ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News