7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... ఈ నెలలో జీతాల పెంపు!

7th Pay Commission Latest News: ఉద్యోగులు దీపావళి పండుగ తర్వాత రెండో పండుగ చేసుకోబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పలు జాతీయా మీడియాల కథనాలు ప్రకారం.. డిసెంబర్ నెలలో జీతాలు పెరగనున్నాయి.

Last Updated : Dec 4, 2020, 10:07 AM IST
7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... ఈ నెలలో జీతాల పెంపు!

7th Pay Commission Latest Updates Today: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీపావళి పండుగ తర్వాత రెండో పండుగ చేసుకోబోతున్నారు. విషయం ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పలు జాతీయా మీడియాల కథనాలు గమనిస్తే... డిసెంబర్ నెల జీతంతో పెరిగే జీతాలు అందుకోనున్నట్లు సమాచారం.

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ సమయాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ వంతు విరాళం అందించారు. ఆ ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తం కరోనాపై పోరాటేందుకు వినియోగించడం తెలిసిందే. జాతీయ మీడియా రిపోర్టులు నిజమైతే డిసెంబర్ నెలాఖరున 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెరిగిన శాలరీలు అందుకోనున్నారు. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రి మండలి సమావేశంలో జీతభత్యాలపై చర్చించి, నిర్ణయాన్ని ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.
Also Read : GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!

7th Pay Commission ప్రకారం..  భారత రైల్వేశాఖలోని నాన్ గెజిటెడ్ మెడికల్ స్టాఫ్ సైతం రూ.21,000 వరకూ జీతాల పెంపును పొందనున్నారు. కొందరికి ప్రమోషన్లు లభిస్తాయి. రైల్వేశాఖలోని నాన్ గెజిటెడ్ మెడికల్ స్టాఫ్ ప్రమోషన్లు పొందితే వారి జీతాలు సైతం పెరుగుతాయి. అయితే నెలవారి రూ.5 వేల వరకు జీతం పెరగనుందని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయంతో హెచ్ఆర్ఏ, డీఏ, టీఏ సైతం పెరుగనున్నాయి. DA, TA కూడా పెరగనుంది.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

నాన్ గెజిటెడ్ మెడికల్ స్టాఫ్ కేటగిరి కిందకి... ల్యాబ్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, మలేరియా ఇన్‌స్పెక్టర్, స్టాఫ్ నర్స్, ఫిజియోథెరపిస్ట్, రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్, డైటీషియన్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ స్టాఫ్ వంటి సిబ్బందికి జీతాలు పెంచేందుకు భారతీయ రైల్వే తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Also Read : WhatsApp Amazing Features: ఈ వాట్సాప్ ఫీచర్స్‌ను మీరు ట్రై చేశారా! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News