80% మందికి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్.. ఆందోళనలో మహా సర్కారు..

కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా 2,00,000 మంది మరణించడంతో పాటు 3 మిలియన్ల మార్కును దాటింది. ఇప్పటివరకు 800,000 మందికి పైగా కోలుకోవడంతో, రికవరీ రేటు 29% వరకు పెరిగింది. కరోనా భారత్ లో విజృంభిస్తోంది. 

Last Updated : Apr 26, 2020, 04:40 PM IST
80% మందికి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్.. ఆందోళనలో మహా సర్కారు..

ముంబై: కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా 2,00,000 మంది మరణించడంతో పాటు 3 మిలియన్ల మార్కును దాటింది. ఇప్పటివరకు 800,000 మందికి పైగా కోలుకోవడంతో, రికవరీ రేటు 29% వరకు పెరిగింది. కరోనా భారత్ లో విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 26,496 కు చేరుకోగా దేశవ్యాప్తంగా 824 మంది మరణించారు. ఇదిలాఉండగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో 80% మంది కరోనా రోగులు ఏ లక్షణాలు లేకుండానే పాజిటివ్ అని తేలిందని, 20% మంది క్లిష్టమైన లక్షణాలను కలిగి ఉన్నారని అన్నారు. ఈ రకంగా ఏ లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ అని తేలడం ఆందోళన పర్చే విషయమని అన్నారు. 

మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో గుర్తించిన హాట్‌స్పాట్‌ల సంఖ్య 402కి పెరిగింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 31,000 వాహనాలను సీజ్ చేశామని  రాష్ట్ర హోమ్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి  అవనీష్ కె అవస్థీ పేర్కొన్నారు. యూపీలో ఇప్పటి వరకు 1,843 పాజిటివ్ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని, వాటిలో 289 కేసులు నయం కాగా ఆసుపత్రి నుండి పంపించామని, ఇప్పటివరకు మొత్తం 29 మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ అన్నారు. 

కరోనా ఉద్భవించిన చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా కొత్తగా కరోనా వైరస్ నమోదు కాలేదని, కోవిడ్ -19 రోగులందరినీ వుహాన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఒక బ్రీఫింగ్లో పేర్కొన్నారు. 

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News