Corona 3rd Wave: దేశంలో తగ్గుతున్నట్టు కనపడుతున్న కరోనా కేసులు తిరిగి పెరుగుతూనే ఉన్నాయి.. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో 38,353 మంది కరోనా పాజిటివ్ (Corona Positve) కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 21,24,953 టెస్టులు చేయగా, 41,195 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ముఖ్యంగా కేరళలో (Kerala)రెండు కోవిడ్ డోసుల తీసుకున్న 40 వేల మందికి పైగా పాజిటివ్ రావటం, బెంగుళూరులో (Bangalore) దాదాపు 5 రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ నిర్దారణ అవ్వటంతో కరోనా తీవ్రత ఎంత అధికంగా ఉందో తెలుస్తుంది. రోజురోజుకి కరోనా కేసులలో హెచ్చు-తగ్గులు ఉన్నప్పటికీ, కేరళలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా కరోనా నిర్దారణ అవ్వటంతో అటు అధికారులను, ఇటు సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.
Also Read: Pushpa: మామూలు మాస్ కాదండోయ్.. ఊర మాస్.. 'తగ్గేదే లే'
ఇలా రెండో డోసు తీసుకున్న వారిలో కరోనా పాజిటివ్ కేసులు (Corona Positve) లక్షకు పైగా నమోదు అవ్వటం, అందులోనే 40 వేలకుపైగా కేసులు కేరళలో గుర్తించటం అక్కడ వైరస్ ఉధృతికి నిదర్శనం అని చెప్పవచ్చు. అప్రమత్తమైన కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, కేరళలో నమోదైన ఈ కేసులన్నీ కొత్త వేరియంట్ల వల్ల వ్యాపిస్తున్నాయా? లేక ఇది వరకే నమోదైన వేరియంట్ల వల్ల అనే నిర్దారణ కోసం కేరళలో డోస్ తీసుకొని పాజిటివ్ నిర్దారణ అయిన ఆ 40 వేల మంది శాంపిళ్లను సేకరించి జన్యుక్రమాల విశ్లేషణ (జీనోమిక్ సీక్వెన్సింగ్) పంపాలని యోచిస్తుంది.
ఇదిలా ఉండగా, బెంగుళూరు (Bangalore)లో గడిచిన 5 రోజుల్లో దాదపు 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ సోకటం వలన, ఇది దేశంలో మూడోవేవ్‌కు (Corona 3rd Wave) ప్రారంభమని కొంత మంది భావిస్తున్నారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 21,24,953 లక్షల టెస్టులు నిర్బహించగా, కొత్తగా 41,195 కరోనా కేసులు నమోదు కాగా, 490 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 32,077,706 మంది కరోనా భారినపడగా, మరణించిన వారి సంఖ్య 429,669కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్‌వి -ఎఫ్ 10 ప్రయోగం విఫలం, ఇవీ కారణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook