AICTE Academic Year 2020-21: డిసెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులు షురూ

AICTE Admissions 2020 | ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( AICTE) డిసెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులను ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్తగా ఇంజినీరింగ్ విద్యను ప్రారంభిస్తున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తోపాటు, ఇతర టెక్నికల్ కోర్సులకు క్లాసులు మొదలుపెట్టనున్నారు. 

Last Updated : Oct 20, 2020, 07:56 PM IST
    • AICTE కీలక నిర్ణయం..
    • డిసెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులు..
    • నవంబర్ 31న అడ్మిషన్స్ కోసం చివరి తేదీ
AICTE Academic Year 2020-21: డిసెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులు షురూ

AICTE Academic Calender 2020-21 | ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( AICTE ) డిసెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులను ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్తగా ఇంజినీరింగ్ ( Engineering ) విద్యను ప్రారంభిస్తున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తోపాటు, ఇతర టెక్నికల్ కోర్సులకు క్లాసులు మొదలుపెట్టనున్నారు. బీటెక్, బీ ఫార్మసీ మొదటి సంవత్సరం క్లాసులను డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించాల్సిందిగా  AICTE విశ్వవిద్యాలయాలను సూచించింది. 

అడ్మిషన్స్ తేదీలో పొడగింపు
అదే సమయంలో కొత్తగా అడ్మిషన్స్ తీసుకోవడానికి గడువును నవంబర్ 31వ తేదీ వరకు  AICTE పొడగించింది. దీనికి తగిన విధంగా విద్యా సంవత్సరంలో మార్పులు చేసింది. అగస్టు 13న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం క్లాసులు నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలి అని నిర్ణయించింది. మొదటి సంవత్సరం అడ్మిషన్స్ కోసం గడవు తేదీని 15వ నిర్ణయించింది. అయితే ఇందులో మార్పులు చేసి ప్రకటన విడుదల చేసింది.

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల  AICTE గడువు తేదీని పొడగించినట్టు తెలిపింది. ఐఐటీలు, ఎన్నైటీ, ట్రిపుల్ ఐఐటీల్లో జరగాల్సిన అడ్మిషన్ల గడువులను కూడా మార్చుతున్నట్టు గతంలో ప్రకటించింది. అదే సమయంలో డిప్లమా ప్రవేశాలకు కూడా 30వ తేదీ వరకు పొడగించింది. అయితే విశ్వవిద్యాలయాలు ( Universities ) కావాలి అనుకుంటే  ఆన్ లైన్ లో పాఠాలు కొనసాగించవచ్చు అని తెలిపింది.

ALSO READ|  IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News