Amar Singh: అమర్ సింగ్ ఇక లేరు

సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఇక లేరు ( Amar Singh died). గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన అక్కడే అనారోగ్యంతో మృతి చెందారు.

Last Updated : Aug 1, 2020, 07:13 PM IST
Amar Singh: అమర్ సింగ్ ఇక లేరు

సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఇక లేరు ( Amar Singh died). గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన అక్కడే అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 64 ఏళ్లు. ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ స్టాల్‌వార్ట్‌గా పేరున్న అమర్ సింగ్ జాతీయ రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయనకు భార్య పంకజ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. Also read: Manikyala Rao: కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతి

అమర్ సింగ్‌కి 2013లో కిడ్నీ ఫెయిల్యూర్ ( Kidney failure ) అవడంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. Kidney transplantation జరిగినప్పటి నుంచే ఆయన కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలు మరీ ఎక్కువ అవడంతో సింగపూర్ వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి కొంత విషమించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. Also read: Visakhapatnam tragedy: క్రేన్ కుప్పకూలి 10 మంది మృతి

Trending News