Amit Shah: ఆ మూడు రాష్ట్రాల్లో వచ్చేది మా ప్రభుత్వమే.. UCC ఖచ్చితంగా అమలు చేస్తాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు కాస్తంత తీరిక దొరికతే వివిధ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో వచ్చేది తమ ప్రభుత్వమే అని చెప్పడంతో పాటు యూసీసీని ఖచ్చితంగా అమలు చేస్తామంటూ ప్రకటన చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 27, 2024, 08:00 AM IST
Amit Shah: ఆ మూడు రాష్ట్రాల్లో వచ్చేది మా ప్రభుత్వమే.. UCC ఖచ్చితంగా అమలు చేస్తాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా 400 సీట్లకు పైగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తాము. అంతేకాదు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలతో చర్చించి అందరికీ ఒకటే చట్టమైన యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమల్లో తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. మరోవైపు ఏపీలో కూటమి 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని చెప్పుకొచ్చారు. అంతేకాదు మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిషా, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తామని ఆషాభావం వ్యక్తం చేసారు. ఒడిషాలోని 147 అసెంబ్లీ సీట్లలో 75 సీట్లకు గెలిచి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు 21 లోక్ సభ సీట్లలో 16 సీట్లలో తమదే విజయం అన్నారు.

అటు పశ్చిమ బెంగాల్‌లో కూడా తమ పార్టీ 24 నుంచి 32 లోక్ సభ సీట్ల వరకు సాధిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అగ్నిపథ్ పథకం కంటే మంచి పథకం ఏమైనా ఉంటే చెప్పమన్నారు. ఇక్కడ నాలుగేళ్లు పనిచేసిన తర్వాత కేంద్ర సాయుధ బలగాల్లో ప్రత్యేక కోటా కిందా ఆ సైనికులను తీసుకుంటాము. అగ్నిపథ్ పథకం లక్ష్యాన్ని అర్ధం చేసుకోకుండా దాన్ని రద్దు చేస్తామంటూ రాహుల్ గాంధీ చెప్పడం శోచనీయమన్నారు. అంతేకాదు సైకిల్, మెర్సిడెస్ బెంజ్ కార్లకు ఒకటే రకమైన పన్ను విధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. పేదలు ఉపయోగంచే సైకిల్‌కు మా ప్రభుత్వం 5 శాతం టాక్స్ ఉంటే.. పెద్దలు ఉపయోగించే మెర్సిడెజ్ బెంజ్ కారుకు 28 శాతం టాక్స్ వేస్తున్నామన్నారు.

అంతేకాదు ఈ ఎన్నికల్లో మేము ఎక్కడ మతం ఆధారంగా ప్రజలను ఓట్లు అడగలేదు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో ఎన్నడు లేనంతగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. వేర్పాటు వాదులు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది మా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం. అంతేకాదు త్వరలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తాము. అంతేకాదు జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తాము. దేశంలో మావోయిస్టులు మొత్తం తుడిచి పెట్టుకుపోయారు. కేవలం ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే కాస్తంత నక్సల్స్ ప్రాబల్యం ఉంది. ఈ సారి అధికారంలో వచ్చిన తర్వాత వారిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం.

అంతేకాదు నిరంతరం ఎన్నికల వల్ల అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అందుకే ఈ సారి అధికారంలోకి రాగానే జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటాము. దీనివల్ల ఎన్నికల్లో చేసే ఖర్చు దిగివస్తుంది. అంతేకాదు ఎన్నికలను మండే ఎండల్లో కాకుండా ఇతర కాలాల్లో పెట్టేలా ఆలోచన చేస్తామన్నారు. అటు కాంగ్రెస్ అగ్రనేత తమ వైఫల్యాలను ఎలక్షన్ కమిషన్ పై తోసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు.

Also read: Remal Cyclone live updates: తీరం దాటిన రెమాల్ తుపాను, బెంగాల్‌లో భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News