Covid Antibodies: కరోనా వ్యాక్సిన్‌పై ఆ అధ్యాయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. టీకా వల్ల కొన్ని నెలల వరకే రక్షణ లభిస్తుందని (Study on Corona Vaccine) తెలిసింది. ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యాయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి.
కరోనా టీకా తీసుకున్న తర్వాత ఆరు నెలల్లోనే చాలా మందిలో యాంటీబాడీలు తగ్గిపోయినట్లు గుర్తించినట్లు అధ్యాయనం (Corona Antibodies Decreasing) పేర్కొంది.
మొత్తం 1,636 మంది వాలంటీర్లు ఈ అధ్యాయనంలో పాల్గొనగా.. అందులో 30 మందిలో యాంటీబాడీలు తగ్గిపోయినట్లు గుర్తించినట్లు నిర్వహకులు (Corona vaccinaion study) పేర్కొన్నారు.
వారిలో త్వరగా తగ్గుతున్న యాంటీ బాడీలు..
షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 40 ఏళ్లు పైబడిన వారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోవడం గమనించినట్లు అధ్యాయం (Corona news) వివరించింది.
ఈ అధ్యాయనంలో పాల్గొన్న వాలంటీర్లంతా.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని నిర్వహకులు వెల్లడించారు. వారిలో దాదాపు 93 సాతం మంది కొవిషీల్డ్ టీకా తీసుకోగా.. 6.2 శాతం మంది కొవాగ్జిన్, ఒక శాతం మంది స్పుత్నిక్ టీకా వ్యాక్సిన్లు వేసుకున్నట్లు వివరించారు.
టీకా తీసుకుని ఆరు నెలల గడిచిన వారిలో.. ఐజీజీ-ఎస్1, ఐజీజీ-ఎస్2 యాంటీబాడీల్లో తగ్గుదల కనిపించినట్లు అధ్యాయనం పేర్కొంది. 30 శాత మందిలో మాత్రం.. టీకా తీసుకున్నప్పటితో పోలిస్తే.. యాంటీ బాడీల్లో భారీ క్షిణతను గుర్తించినట్లు తెలిపింది.
చివరగా..
కొవిడ్ టీకా తీసుకున్నప్పటికీ.. ఆరు నెలల తర్వాత యాంటీ బాడీలు తగ్గుతున్న కారణంగా మళ్లీ కరోనా సోకే ప్రమాదం ఉందని ఈ అధ్యాయనంలో భాగస్వాములైన విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే అలాంటి వ్యక్తులు బూస్టర్ డోసు తీసుకోవడం సురక్షితమని అంటున్నారు. ఇక సాధారణంగా ఎవరైనా రెండు డోసుల టీకా తీసుకుని 9 నెలలు గడిచిన తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడం మంచిదేనని (Best time for Corona Booster Dose) చెబుతున్నారు.
ప్రస్తుతం దేశంలో బూస్టర్ డోసు (ప్రికాషన్) అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం (Corona Booster dose in India) ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు మాత్రమే మూడో డోసు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో అందరికీ ప్రికాషన్ డోసు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: Sabarimala : శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం.. ఆరు జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook