Aravind Kejriwal Arrest: అరెస్ట్ విషయంలో రికార్డు క్రియేట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్..

Aravind Kejriwal Arrest: అవును అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసినా సంచలనమే. పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడం... అంతలోనే రాజీనామా చేయడం.. మళ్లీ ఎన్నికలకు వెళ్లి ముఖ్యమంత్రిగా తన సీటును పదిల పరుచుకోవడం ఇలాంటి అన్ని విషయాల్లో రికార్డులు క్రియేట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 22, 2024, 10:06 AM IST
Aravind Kejriwal Arrest: అరెస్ట్ విషయంలో రికార్డు క్రియేట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్..

Aravind Kejriwal Arrest: దిల్లీ మద్యం కుంభకోణంలో తీగ లాగితే డొంక కదిలినట్టు..ఈ కేసుతో ముడిపడిఉన్న ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. ఈయన అరస్ట్ వ్యవహారంతో దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయనే చెప్పాలి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ సమయంలో వ్యవహరించినట్టుగానే కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంలో ఈడీ అధికారులు అలాగే ప్రవర్తించారు. సెర్చ వారెంట్‌తో దిల్లీ సీఎం ఇంటికి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. ఆ తర్వాత విచారణ నిమిత్తం అరవింద్ కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిందనే చెప్పాలి. ఈయన అరెస్ట్ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసొస్తుందా.. లేకపోతే వాళ్లు పుట్టి ముంచుతుందా అనేది చూడాలి. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో దిల్లీ నెక్ట్స్ ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తిరకంగా మారింది.

ఆ సంగతి పక్కన పెడితే.. ముఖ్యమంత్రి పదవిలో ఉండగనే అరెస్ట్ అయిన తొలి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్‌ క్రియేట్ చేసారు. ఈయన కంటే పలువురు ముఖ్యమంత్రులు అరెస్ట్ కాబోయే సందర్భంగా రాజీనామాలు చేసి జైలుకు వెళ్లారు. అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రులు జాబితాను చూస్తే .. బిహార్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎం జయలలిత, హరియాణ మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్‌ చౌతాలా, ఝర్ఖండ్ మాజీ సీంఎ మధుకోడా, లేటెస్ట్‌గా హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన వాళ్ల లిస్టులో ఉన్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్.. 1990 నుంచి 1997 మధ్య బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పశుదాణా స్కామ్‌లో అప్పటి న్యాయస్థానం ఆర్జీడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు జగన్నాథ్ మిశ్రాలను దోషులుగా తేల్చాయి. ఆ తర్వాత జైలుకు వెళ్లిన తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.

జయలలిత.. పురుచ్చితలైవి.. 1990 నుంచి 2016 మధ్యకాలంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మధ్యలో కరుణానిధి సీఎం అయ్యారు. ఈమె పదవి కాలంలో పేదలకు కలర్ టీవీలు ఇచ్చే స్కామ్‌లో జయలలితన కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఈమె 7 డిసెంబర్ 1996లో అరెస్ట్ అయ్యారు. అపుడు అమె నెల రోజులుకు పైగా జైలు జీవితం గడిపారు. అటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014 కోర్టు ఆమెను దోషిగా డిక్లేర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె మరోసారి జైలుకు వెళ్లారు. ఈమె రెండుసార్లు అరెస్ట్ అయిన సందర్భంలో పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

ఓం ప్రకాశ్ చౌతాలా : 1989 -2005లో మధ్య హరియాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. టీచర్ పోస్టులు భర్తీలో అక్రమాలకు పాల్పడ్డట్టు తేలడంతో 2013లో న్యాయస్థానం ఆయన్ని దోషిగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్ష వేసింది. ఆ తర్వాత అక్రమాస్తుల వ్యవహారంలో 2022లో కోర్టు మరో నాలుగేళ్లు శిక్ష విధించింది.

మధుకోడా :  మన దేశంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి .. ముఖ్యమంత్రి అయిన వ్యక్తుల్లో మధు కోడా ఒకరు. ఈయన 2009లో అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు.

హేమంత్ సోరెన్: 2013 -2024  మధ్యకాలంలో ఝర్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన హేమంత్ సోరెన్.. భూ కుంభకోణంతో పాటు మనీ లాండరింగ్ వంటి కేసుల్లో ఈడీ మరియు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈయన ఈ యేడాది జనవరి 31న అరెస్ట్ అయ్యారు. దీంతో ఆయన పదవికి రాజీనామా చేసారు. ఆయన ప్లేస్‌లో జేఎంఎం సీనియర్ నేత చంపయూ సోరెన్ సీఎంగా అయ్యారు.

Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News