హైదరాబాద్ ( Hyderabad) లో భారీ ఏటిఎం మోసం ( ATM Fraud In Hyderabad ) వెలుగులోకి వచ్చింది. ఆడిటింగ్ లో ( Auditing ) ఏటిఎం సిబ్బంది చేతి వాటం, వారు చేసిన నేరం గుట్టుగురట్టయింది. ఏటీఎం మెషిన్స్ లో డబ్బు నింపే సిబ్బంది సుమారు రూ. ఒక కోటి 23 లక్షలు స్వాహా చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం గురించి తెలుసుకున్న సికింద్రాబాద్ లోని సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ ( Secure Value India Private Organisation ) సంస్థ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను ఆశ్రయించింది. Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ సంస్థ ఏటీఎం మెషిన్స్ లో ( ATM Mechines ) డబ్బు డిపాజిట్ వంటి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసులు చేస్తుంది. దీని కోసం బిటిఐ పేమెంట్ అనే మరో సంస్థతో ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. సుమారు 36 ఏటిఎం మెషిన్స్ ను మేనేజ్ చేయడం ఆ ఒప్పదంలో భాగం. దీని కోసం బిటిఐ సంస్థకు చెందిన రాజశేఖర్ రెడ్డి, రమాభారత్, సాయితేజ, అశ్విన్ లను కస్టోడియన్ గా ఎంపిక చేశారు. వారికి ఏటిఎం తాళాలు, పాస్ వర్డ్ వంటి వివరాలు కూడా అందించారు. కాగా కొంత కాలం క్రితం ఆడిటింగ్ నిర్వహించగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే
Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?