Ayurvedic medicine: ఇకపై ఆయుర్వేద డాక్టర్లు సైతం ఆపరేషన్ చేయవచ్చు

వైద్యరంగంలో ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతోంది. భారతీయ ఆయుర్వేద వైద్య చికిత్సకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై ఆయుర్వేద వైద్యులు సైతం శస్త్ర చికిత్సలు చేసుకోవచ్చు.

Last Updated : Nov 21, 2020, 07:15 PM IST
Ayurvedic medicine: ఇకపై ఆయుర్వేద డాక్టర్లు సైతం ఆపరేషన్ చేయవచ్చు

వైద్యరంగంలో ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతోంది. భారతీయ ఆయుర్వేద వైద్య చికిత్సకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై ఆయుర్వేద వైద్యులు సైతం శస్త్ర చికిత్సలు చేసుకోవచ్చు. 

దేశంలో ఆయుర్వేద వైద్యానికి ( Ayurveda medicine ) పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని..కేంద్ర ప్రభుత్వం ( Central Government ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా..మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.  ఇకపై ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ( Post graduate in ayurveda medicine ) లేదా డిగ్రీ చేసిన విద్యార్దులు వివిధ రకాల సాధారణ శస్త్రచికిత్సలు ( Surgeries ) చేసేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు  ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ 2016 నిబంధనలను సవరించింది. షాలియా ( సాధారణ శస్త్రచికిత్స ) షాలక్య ( ఈఎన్‌టీ, హెడ్‌, డెంటల్‌ స్పెషలైజేషన్‌ ) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అనంతరం ఈఎన్‌టీ, దంత వైద్యంతోపాటు, కంటి శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది.

ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్‌ గ్రాఫ్టింగ్‌, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు. నవంబర్ 19న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో భాగంగా  షాలియా ( సాధారణ శస్త్రచికిత్స ) షాలక్య ( చెవి, ముక్కు, గొంతు వ్యాధులు ) విధానాలలో శిక్షణ అందిస్తారు. దీనిద్వారా స్వతంత్రగా సర్జరీలను నిర్వహించే సామర్ధ్యం లభిస్తుంది. Also read: Pm Modi: రానున్న ఐదేళ్లలో చమురు నిల్వల్ని రెండింతలు పెంచుతాం

Trending News