Bank Holidays in May 2022: మే నెలలో 13 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు!

Bank Holidays in May 2022: మే​ నెలలోని తొలి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో పాటు మే నెల మొత్తంగా 31 రోజులకు గాను 13 రోజుల పాటు బ్యాంకులు సెలవులు ఉన్నాయి. అయితే బ్యాంకులు మూతపడనున్న రోజులేవో ఇప్పుడు తెలుసుకుందాం.     

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 12:52 PM IST
Bank Holidays in May 2022: మే నెలలో 13 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు!

Bank Holidays in May 2022: రాబోయే మే నెలలో బ్యాంకు వ్యవహారాలను పూర్తి చేయాలనుకుంటున్నారా? అయితే మే నెలలో బ్యాంకులు మూతపడనున్న రోజులేవో ఇప్పుడు తెలుసుకుందాం. వీటి గురించి అవగాహన తెలుసుకుంటే సెలవు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండొచ్చు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం మే 2022 నెలలో బ్యాంకుల సెలవులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. 

నాలుగు రోజులు పాటు బ్యాంకులు మూత!

RBI క్యాలెండర్ ప్రకారం మే నెలలోని మొదటి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పండుగలను బట్టి సెలవులు మారే అవకాశం ఉంది. అయితే మే నెలలో బ్యాంకులు మూతపడనున్న రోజులేవో తెలుసుకుందాం. 

జాతీయంగా మే నెలలోని 31 రోజుల్లో 13 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులకు వెళ్లే ముందు అన్ని సెలవుల గురించి తెలుసుకోవాలని కస్టమర్లకు తెలియజేశారు. 

మే నెలలో బ్యాంక్ సెలవుల జాబితా 

2022 మే 1 : కార్మిక దినోత్సవం / మహారాష్ట్ర రాష్ట్ర దినోత్సవం. ఇదే రోజున ఆదివారం కావడం వల్ల కూడా సెలవుగా ఉంటుంది. 

2022 మే 2 : మహర్షి పరశురామ జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)

2022  మే 3 : ఈద్-ఉల్-ఫితర్, బసవ జయంతి (కర్ణాటక)

2022 మే 4 : ఈద్-ఉల్-ఫితర్, (తెలంగాణ)

2022 మే 8 : ఆదివారం (వారాంతపు సెలవు)

2022 మే 9 : గురు రవీంద్రనాథ్ జయంతి - పశ్చిమ బెంగాల్, త్రిపుర

2022 మే 14 : రెండవ శనివారం బ్యాంకులకు సెలవు

2022 మే 22 : ఆదివారం (వారాంతపు సెలవు)

2022 మే 16 : మెర్క్యురీ పౌర్ణమి

2022 మే 22 : ఆదివారం (వారాంతపు సెలవు)

2022 మే 24 : కాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టినరోజు - సిక్కిం

2022 మే 28 : 4వ శనివారం బ్యాంకులకు సెలవు

2022 మే 29 : ఆదివారం (వారాంతపు సెలవు) 

Also Read: CHSL Notification 2022: ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. నోటిఫికేషన్ విడుదల!

Also Read: India Covid Cases: మరోసారి పెరిగిన కరోనా కేసులు.. భయాందోళనలో ఢిల్లీ వాసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News