February 2025 Bank Holidays: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ లావాదేవీలే నడుస్తున్నాయి. అంతా మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులే ఉంటున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని పనుల కోసం మాత్రం బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటోంది. అందుకే బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో చెక్ చేసుకోవడం మంచిది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి బ్యాంకు సెలవుల జాబితా ప్రకటించింది. మరో రెండ్రోజుల్లో ఫిబ్రవరి నెల ప్రారంభం కానుంది. జనవరిలో సంక్రాంతి, రిపబ్లిక్ డే, జనవరి 1 ఇలా దాదాపు సగం రోజులు బ్యాంకులు పనిచేయలేదు. ఇప్పుడు ఫిబ్రవరిలో కేవలం 28 రోజులే ఉన్నాయి. ఈ 28 రోజుల్లో బ్యాంకులకు 14 రోజులు సెలవులున్నాయి.
వీటిలో రెండు, నాలుగు శనివారాలు, నాలుగు ఆదివారాలు కలిపి 6 రోజులున్నాయి. మిగిలినవి ప్రాంతీయ, జాతీయ సెలవులు. 28 రోజుల్లో 14 రోజులు మినహాయిస్తే ఇక 14 రోజులే బ్యాంకులు పనిచేయనున్నాయి. అందుకే బ్యాంకు పనులుంటే ఈ సెలవులకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం మంచిది. సెలవు రోజుల్లో ఏటీఎం సేవలు యథావిధిగా పనిచేస్తాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. యూపీఐ చెల్లింపులు అన్నీ కొనసాగుతాయి.
ఫిబ్రవరి 2 ఆదివారం బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 3 సరస్వతి పూజ సందర్భంగా అగర్తలలో సెలవు
ఫిబ్రవరి 8 రెండవ శనివారం సెలవు
ఫిబ్రవరి 9 ఆదివారం సెలవు
ఫిబ్రవరి 11 థాయ్ పోసమ్ చెన్నైలో బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 12 గురు రవిదాస్ జయంత్రి షిమ్లాలో బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 15 ల్యూన్ గాయిని ఇంఫాల్‌లో సెలవు
ఫిబ్రవరి 16 ఆదివారం సెలవు
ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతి నాగపూర్, ముంబై, బేలాపూర్‌లో సెలవు
ఫిబ్రవరి 20 ఐజ్వాల్, ఈటానగర్‌లో రాష్ట్ర దినోత్సవం సెలవు
ఫిబ్రవరి 22 నాలుగో శనివారం సెలవు
ఫిబ్రవరి 23 ఆదివారం సెలవు
ఫిబ్రవరి 26 మహా శివరాత్రి సెలవు
Also read: Public Holidays: విద్యార్ధులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఆ 3 రోజులు పబ్లిక్ హాలిడేస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి