BF.7 Variant News: ఇండియాలో కరోనా పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన కొవిడ్ ప్యానెల్ చీఫ్ అరోరా

BF.7 Variant cases in India : చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ విలయతాండవం చేస్తుండటమే. చైనాతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న బిఎఫ్.7 వేరియంట్ తాజాగా భారత్‌లోనూ కాలుమోపింది. గుజరాత్‌లోని వదోదరలో ఒక కేసు, అహ్మెదాబాద్‌లో మరొక కేసు, ఒడిషాలో మూడో కేసు నమోదయ్యాయి. 

Written by - Pavan | Last Updated : Dec 21, 2022, 11:29 PM IST
BF.7 Variant News: ఇండియాలో కరోనా పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన కొవిడ్ ప్యానెల్ చీఫ్ అరోరా

BF.7 Variant Cases In India: చైనాలో ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ కేసులు సంక్రమిస్తున్న తీరు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో భారీ సంఖ్యలో పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు ప్రపంచానికి మరోసారి పాత రోజులను గుర్తుచేస్తున్నాయి. చైనాను చూసి ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. తమ దేశంలో చైనా లాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. భారత్‌లోనూ ప్రస్తుతం అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. పొరుగు దేశమైన చైనాను చూసి భారత్ అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ కేంద్రం ఆదేశాలు సైతం జారీచేసింది. కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యపై ఓ కన్నేసి పెట్టాలని.. అవసరమైతే శాంపిల్స్ సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించి కరోనావైరస్ వేరియంట్‌ని నిర్థారించుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టంచేసింది.

చైనాలోని ఆస్పత్రులు కరోనా వైరస్ సోకిన పేషెంట్స్‌తో నిండిపోయాయి. చాలా వరకు ఆస్పత్రులలో బెడ్స్ లభించే అవకాశం లేకుండాపోయింది. చనిపోయిన వారి మృతదేహాలు సైతం పేరుకుపోతున్నాయి. స్మశానాల్లో రద్దీ భారీగా పెరిగింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చాలా చోట్ల లాక్ డౌన్ విధించారు. పేషెంట్స్‌ని బలవంతంగా క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. చైనాలో నెలకొన్న ఈ భయంకరమైన పరిస్థితిని చూసి చాలామందిని ఆందోళన చెందుతున్నారు. 

భారత్‌లో కూడా కరోనైవైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బిఎఫ్. 7 వేరియంట్‌తో భారీ నష్టం తప్పదా అనే సందేహాలు కలుగుతున్నాయి. రెండేళ్ల కిందటి తరహాలోనే భారీ సంఖ్యలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగితే మన దేశంలో కూడా మళ్లీ లాక్ డౌన్ విధిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అదే కానీ జరిగితే.. తాము మరోసారి బతుకుదెరువు కోల్పోవాల్సిందేనా అనే భయం నిరుపేద, మధ్య తరగతి జనం భయపడిపోతున్నారు. రెండేళ్ల కింద చూసిన ఆకలి చావులు మళ్లీ చూస్తామా అనే భయమే ఎక్కువగా హడలెత్తిస్తోంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ చీఫ్ డా ఎన్.కె. అరోరా స్పందించారు. నేషనల్ ఇమ్యునజైషన్ టెక్నికల్ అజ్వైజరీ గ్రూప్ (NTAGI) లో ఒకటైన టాస్క్ ఫోర్స్ చీఫ్ అరోరా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. చైనాతో పోల్చుకుంటే ఇండియాలో అధిక శాతం జనాభాకు వ్యాక్సిన్స్‌తో ఇమ్యునిటీ వచ్చిందని గుర్తుచేశారు. ముఖ్యంగా యుక్తవయస్సు వారిలో ఇమ్యునిటీ ఎక్కువగా ఉందని అన్నారు. దేశంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. చైనాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే భారత్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు అరోరా తెలిపారు.

రానున్న 3 నెలల్లో చైనాలో 60 శాతం జనాభాకు కరోనావైరస్ సోకే ప్రమాదం ఉందని అక్కడి ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మిలియన్ జనాభాకుపైనే మంది కరోనా కోరలకు చిక్కి బలవుతారని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి : BF.7 Variant Cases in India: వామ్మో.. చైనాను హడలెత్తిస్తున్న వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది

ఇది కూడా చదవండి : BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎందుకంత వణికిస్తోంది ? లక్షణాలు ఏంటి ?

ఇది కూడా చదవండి : Kidney stones: మీ శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తే..నిర్లక్ష్యం చేయవద్దు, ప్రమాదకరమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News