బీజేపీ ముఖ్యమంత్రులతో మోదీ, అమిత్‌ షా కీలక భేటీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఢిల్లీలో భేటీ కానున్నారు.

Last Updated : Aug 28, 2018, 02:13 PM IST
బీజేపీ ముఖ్యమంత్రులతో మోదీ, అమిత్‌ షా కీలక భేటీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈమేరకు అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. రాబోయే ఎన్నికల వ్యూహాలపై సీఎంలతో మోదీ, అమిత్‌ షాలు చర్చించనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు వ్యూహ రచనలో భాగంగా ఈ భేటీ జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

15 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ, బీ అమిత్‌ షా సమావేశమవుతున్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే మధ్యప్రదేశ్‌, ఛత్తీస్గఢ్, రాజస్థాన్‌ ఎన్నికలు, రాబోయే లోక్‌సభ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమాలు, పనుల అమలు గురించి హైకమాండ్ తెలుసుకోవడంతో పాటు పలు సూచనలు ఇస్తుందని సమాచారం. అలానే జమిలి ఎన్నికలపై కూడా చర్చిస్తారని తెలిసింది. వివిధ రాష్ట్రాల బీజేపీ ఉప ముఖ్యమంత్రులు కూడా సమావేశానికి హాజరుకానున్నారు.

Trending News