నంద్యాల ఉపపోరులో టీడీపీదే గెలుపు

.

Last Updated : Aug 28, 2017, 03:55 PM IST
నంద్యాల ఉపపోరులో టీడీపీదే గెలుపు

ఏపీ సర్కార్ ప్రభుత్వ పనితీరుపై రెఫరెండంగా భావించిన నంద్యాల ఉపపోరు ఫలితాలను సోమవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డిపై టీడీపీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి 27 వేల 466 ఓట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగ్గా.. టీడీపీ అభ్యర్థికి 97,076 ఓట్లు,  వైకాపా అభ్యర్థికి 69,610 ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో టీడీపీకి 56 శాతం ఓట్లు రాగా.. వైసీపీ 40 శాతం ఓట్లు వచ్చాయి. ఉపపోరులో మొత్తం పోలైన ఓట్లలో 56 శాతం టీడీపీకి రాగా.. వైసీపీ 40 శాతం ఓట్ల వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం వెయ్యి ఓట్లకు మాత్రమే పరిమితమైంది.

తెలుగు తమ్మళ్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు..

నంద్యాల ఉప పోరును ఇరు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పోరులో వైసీపీ అధినేత 13 రోజుల పాటు నంద్యాల నియోజకవర్గంలో పర్యటించి ఇంటికి వెళ్లి ప్రచారం చేయగా.. టీడీపీ అధినేతతో పాటు రాష్ట్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే నంద్యాల ఓటర్లు టీడీపీ వైపే మొగ్గుచూపడం గమనార్హం. వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో టీడీపీ ఈ స్థాయిలో గెలుపొందడం ..ఆ పార్టీ శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. మరోవైపు పట్టున్న ప్రాంతంలో ఓటమి చెందడం వైసీపీ నేతలతో పాటు శ్రేణులకూ నిరాశపర్చింది.

Trending News