మన్ కీ బాత్ - చాయ్ కే సాథ్

దరియాపూర్‌లో అమిత్ షా, సబర్మతిలో అరుణ్ జైట్లీ, పోర్‌బందర్‌లో పీయూష్ గోయల్, జునాగఢ్‌లో స్మృతి ఇరానీ పాల్గొని ప్రజలతో కలిసి ఛాయ్ తాగనున్నారు.

Last Updated : Nov 26, 2017, 12:04 PM IST
మన్ కీ బాత్ - చాయ్ కే సాథ్

భారత ప్రధాని బాల్యంలో ఛాయ్ అమ్మడంపై వ్యంగ్య బాణాలు కురిపించిన గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి బీజేపీ కౌంటర్ విసిరింది. త్వరలో నరేంద్ర మోడీ పాల్గొనే ‘మన్‌ కీ బాత్’ రేడియో కార్యక్రమాన్ని 50 వేల పోలింగ్ బూత్‌ల వద్ద ప్రసారం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు గాను భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించింది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ,అమిత్ షా స్వయంగా  ఈ కార్యక్రమంలో ప్రజలకు ఛాయ్ అందివ్వనున్నారట.

‘ మన్ కీ బాత్ - చాయ్ కే సాథ్’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. దరియాపూర్‌లో అమిత్ షా, సబర్మతిలో అరుణ్ జైట్లీ, పోర్‌బందర్‌లో పీయూష్ గోయల్, జునాగఢ్‌లో స్మృతి ఇరానీ పాల్గొని ప్రజలతో కలిసి ఛాయ్ తాగనున్నారు. వచ్చే నెల గుజరాత్ ఎన్నికలు వస్తున్న క్రమంలో ఈ ‘మన్ కీ బాత్ - చాయ్ కే సాథ్’ కార్యక్రమాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలని చూస్తుందని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. 

Trending News