India hits out at China : చైనా చేసిన ఆరోపణలపై ఇండియా స్పందించింది. ఈ విషయంలో తీవ్రంగా మండిపడింది. డ్రాగన్ కవ్వింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్లే సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని భారత్ స్పష్టం చేసింది.
సరిహద్దు వెంబడి మళ్లీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో మన సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏల్ఏసీ వెంబడి చైనాతో ( India vs China) ఉద్రిక్తత పరిస్థితులు నిత్యం పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ (Home Ministry ) అప్రమత్తమైంది.
లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత సైన్యంపై చైనా దురఘాతానికి పాల్పడిన నాటి నుంచి ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ) చైనాకు వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని లక్ష్యంగా చేసుకుంటూ పలు విమర్శలు సంధించారు. గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘటన నాటినుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.
చైనా (china) భూ దాహానికి అంతులేకుండా పోతోంది. కరోనా వైరస్ (Coronavirus) ను మొత్తం ప్రపంచానికి వ్యాప్తిచేసిందన్న ఆరోపణల తరువాత చైనా అనేక దేశాలతో సంబంధాలను తెంచుకుంటూ ఘర్షణలకు దిగుతూ వస్తోంది. ఇటీవలనే భారతదేశం (india-china), మయన్మార్, జపాన్ తరువాత, చైనా ఇప్పుడు రష్యా (russia)కు వ్యతిరేకంగా కయ్యానికి కాలుదువ్వుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.