Harley Davidson బైక్‌పై చీఫ్ జస్టిస్ బాబ్డే.. ఫొటోలు వైరల్

CJI SA Bobde Spotted On Harley Davidson | సుప్రీం కోర్టు దాటగానే ఆయన అచ్చం సాధారణ వ్యక్తుల్లా మారిపోతారు. ఆయన మరోవరో కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే. హార్లే-డేవిడ్‌సన్ బైక్‌పై కనిపించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Last Updated : Jun 29, 2020, 05:45 PM IST
Harley Davidson బైక్‌పై చీఫ్ జస్టిస్ బాబ్డే.. ఫొటోలు వైరల్

న్యూఢిల్లీ: ఆయన భారత సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India). అయినా ఆయన అభిరుచుల విషయంలో ఏమాత్రం వెనక్కితగ్గరు. సుప్రీం కోర్టు దాటగానే ఆయన అచ్చం సాధారణ వ్యక్తుల్లా మారిపోతారు. ఆయన మరోవరో కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే (Sharad Arvind Bobde). ‘ఊపిరి ఆడటం లేదు.. బై డాడీ’ కరోనా పేషెంట్ చివరి వీడియో

ఈ క్రమంలో సీజేఐ ఎస్‌ఏ బాబ్డే హార్లే-డేవిడ్సన్ సీవీఓ (Harley-Davidson CVO 2020) బైక్‌పై కనిపించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటో గమనిస్తే.. చీఫ్ జస్టిస్ బాబ్డే.. హార్లే డేవిడ్సన్ లిమిటెడ్ ఎడిషన్ సీవీఓ 2020 బైక్ మీద కూర్చొని ఉన్నారు. భద్రతా సిబ్బంది కూడా ఆయన చుట్టూ ఉన్నారు. ఏపీలో కరోనా కల్లోలం.. తాజాగా 11 మంది మృతి

జస్టిస్ బాబ్డేకు బైక్స్ నడపడమంటే అమితమైన ఇష్టం. ఆయనకు క్రికెట్ ఆడటం, చూడటం, పుస్తకాలు చదవడం, ఫొటోగ్రఫీ చేయడమన్న ఇష్టమే.. అంతేకాకుండా డాగ్ లవర్ కూడా.  ఇంట్లో ఉన్నప్పుడు తన పెట్‌ డాగ్‌తో ఆడుకుంటుంటారు. ఇప్పుడు జస్టిస్ బాబ్డేకు చెందిన ఈ కూల్ లుక్ బయటకు రాగానే.. ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది. కాగా, 2019 నవంబర్ 18న సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

Trending News