తగ్గిన బంగారం ధరలు.. వెండి పైపైకి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. నిన్న ఆల్ టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన బంగారం నేడు కాస్త దిగొచ్చింది. కాగా, వెండి మాత్రం గరిష్ట దరలు నమోదు చేసింది.

Shankar Dukanam Shankar Dukanam | Updated: Jun 4, 2020, 07:31 AM IST
తగ్గిన బంగారం ధరలు.. వెండి పైపైకి

బులియన్ మార్కెట్‌లో ఈ వారం తొలిసారి బంగారం ధరలు తగ్గాయి. నిన్న మార్కెట్లో ఆల్‌టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన బంగారం నేడు కాస్త దిగొచ్చింది. మరోవైపు వెండి ధర అతి స్వల్పంగా పెరిగింది. 

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.50 మేర అతి స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,170కి దిగొచ్చింది.  అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,070కి క్షీణించింది. జూన్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

ఢిల్లీ మార్కెట్‌లో నేడు బంగారం మిశ్రమ ధరలు నమోదు చేసింది.  నిన్న రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేడు రూ.550 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,150కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.50 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.45,950కి ఎగసింది.    గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్

నేటి మార్కెట్‌లో బంగారం ధరలు పతనం కాగా, వెండి ధర అతి స్వల్పంగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట ధర నమోదు చేసింది. వరుసగా ఆరోరోజూ వెండి ధర పెరిగింది. నేటి మార్కెట్‌లో రూ.10 మేర అతి స్వల్పంగా ధర పెరగడంతో 1 కేజీ వెండి ధర ధర రూ.50,160కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి