Mass Suicide in Rajasthan: రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం ఓ దంపతులు తమ ఐదుగురు పిల్లలతో సహా కాల్వలో దూకి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సంచోర్ ప్రాంతంలో జరిగింది. జిల్లా కలెక్టర్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక డైవర్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అంతేకాకుండా జోధ్‌పూర్ నుండి ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పిలిపించారు. మెుదట 9 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. సాయంత్రానికి మెుత్తం ఏడు బాడీస్ ను కాలువ నుండి బయటకు తీశారు.
అసలేం జరిగింది...
సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివశిస్తున్న శంకర్ లాల్, బద్లి దంపతులకు తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరోసారి ఆ భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన శంకర్ తన భార్య పిల్లలను తీసుకుని సిద్ధిశ్వేర్ అనే గ్రామ సమీపంలోని నర్మద కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన గాలిపా నివాసి భన్వర్ సింగ్ రాజ్‌పుత్ పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు.
గురువారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో పెద్ద ఎత్తున అధికారులు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసి మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు వారిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also Read: Robotic Elephant: ఆలయంలో దేవుడి ఊరేగింపుకు 'రోబోటిక్ ఏనుగు'.. ఎక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook