కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమన్న సీపీఎం

  

Last Updated : Apr 20, 2018, 12:17 PM IST
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమన్న సీపీఎం

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన మనసులో మాట బయటపెట్టారు. బీజేపీని గద్దెదించడమే లక్ష్యంతో తమ పొత్తులు ఉంటాయన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రస్తకేలేదని  సీతారాం ఏచూరి ప్రకటించారు. సీపీఎం మహాసభల వివరాలను గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా పొత్తల విషయాన్ని బయటపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  రెండు నెలల కిందటే రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించామని, కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. అంతిమంగా కాంగ్రెస్ తో జట్టకట్ట కూడదని నిర్ణయించామన్నారు.

తెలగురాష్ట్రాలో వాపక్షాల రూట్ ఎటూ ?
ఏచూరి మాటలను బట్టి చూస్తే దేశంలో థార్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వాపపక్షాలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోది. ఇటీవలికాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నోట ధార్డ్ ఫ్రంట్ మాట వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంటే తెలంగాణలో  వామపక్ష పార్టీలు టీఆర్ఎస్ తో దోస్తీ చేసే అవకాశాలున్నాయని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో సంబంధాలు తెంచుకున్న టీడీపీతో వాపపక్షాలు జతకట్టే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు  అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Trending News