Cyclone Jawad: వాయుగుండంగా జవాద్ తుపాన్​- ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు!

Cyclone Jawad: జవాద్​ తుపాను వాయుగుండంగా మారి దిశను మార్చుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఇది ఒడిశా తీరాన్ని తాకే అవకాశముంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 09:59 AM IST
  • బలహీన పడిన జవాద్ తుపాను
  • వాయు గండంగా మారినట్లు ఐఎండీ వెల్లడి
  • ఉత్తరాంధ్ర, ఒడిశాకు వర్ష సూచన
Cyclone Jawad: వాయుగుండంగా జవాద్ తుపాన్​- ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు!

Cyclone Jawad: బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను బలహీన పడింది. దీనితో ఉత్రరాంధ్రకు భారీ ముప్పు తప్పింది. అయితే జవాద్ తుపాను (Cyclone Jawad latest update) తిరిగి తీవ్ర వాయు గుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం ఈ వాయుగుండం స్థిరంగా కదులుతున్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ (IMD on Cyclone Jawad) నిపుణులు. అయితే నేడు (ఆదివారం) మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ తీరాన్ని ఈ వాయుగుండం తాకొచ్చని అంచనా వేశారు. ఇది మరింత బలహీనపడి అల్ప పీడనంగా మారొచ్చని కూడా చెబుతున్నారు.

ఈ ప్రాంతాల్లో వర్షాలు..

తపాను ప్రభావం తప్పినప్పటికీ ఏపీ, ఒడిశాల్లో పలు ప్రాంతాల్లో భారీ వానలు (Cyclone Jawad impact on Odisha) పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్రా, దక్షిణ ఒడిశా జిల్లాల్లో వర్షాలు అధికంగా పడపొచ్చని వెల్లడించింది.

ఏపీలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుల జిల్లాలపై వాయుగండం ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ (Cyclone Jawad impact on AP) పేర్కొంది.

ఇప్పటికే ఆయా జిల్లాల్లో శక్రవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారకణంగా కోస్తా జిల్లాల్లో పంట నష్టం వాటిళ్లింది.

శుక్రవారం తుపానుగా మారి..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం శుక్రవారం తుపానుగా మారింది. కోస్త ఆంధ్రా దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. ఆ తర్వాత ఒడిశా తీరాన్ని తాకుతుందని చెప్పారు.

అయితే శుక్రవారం సాయంత్రం తుపాను దిశను మార్చుకుని.. వాయుగుండంగా మారినట్లు వివరించారు వాతావరణ శాఖ విశ్లేషకులు.

తపాను ప్రమాదం తప్పినా..

తుపాను నుంచి ప్రమాదం తప్పినప్పటికీ.. వర్షాలు, బలమైన గాలుల ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ ప్రభావం సోమవారం వరకు తీవ్రంగా ఉంటుందని తెలిపింది.

అప్రమత్తంగా ఎన్​డీఆర్​ఎఫ్​

జవాద్ తుపాను ఏర్పడిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలకు ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు మోహరించాయి. ఇప్పటికే పలువురికి పునరావాసం కల్పించాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించాయి.

Also read: CM Nitish Kumar : సీఎం తనను బ్యూటీఫుల్ అన్నాడని బాధపడ్డ మహిళా ఎమ్మెల్యే

Also read: Omicron: భారత్‌లో నాలుగో ఒమిక్రాన్‌ కేసు..ముంబైలో గుర్తింపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News