Dharma sansad case: అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపైనా విచారణ చేపట్టండి!

Dharma sansad case: ది హిందూ ఫ్రంట్​ ఫర్ జస్టిస్​ అధ్యక్షుడు సహా పలువురు ఇతరులు సుప్రీం కోర్టులో ఇంటర్వెన్షన్ పిటిషన్​ దాఖలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపైనా విచారణ చేపట్టాలని కోరారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 02:08 PM IST
  • సుప్రీం కోర్టులో ది హిందూ ఫ్రంట్​ ఫర్ పిటిషన్​
  • హిందువులపై విద్వేశ పూరిత ప్రసంగాలను పరిశీలించాలని వినతి
  • అక్బరుద్ధిన్ ఒవైసీ, ఆప్​ నేత అమానాతుల్లా ఖాన్ వ్యాఖ్యలను జోడిస్తూ ఫిర్యాదు
Dharma sansad case: అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపైనా విచారణ చేపట్టండి!

Dharma sansad case: హరిద్వార్​లోని ధర్మ సంసాద్​కు సంబంధించిన ఇటీవలి ద్వేశ పూరిత ప్రసంగం కేసులో ది హిందూ ఫ్రంట్​ ఫర్ జస్టిస్ (Hindu Front for Justice)​ అధ్యక్షుడు సహా పలువురు ఇతరులు కలిసి.. సుప్రీం కోర్టులో ఇంటర్వేన్షన్​ పిటిషన్ దాఖలు చేశారు.

ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించిన నేపథ్యంలో.. హిందువులపై విద్వేశ పూరిత ప్రసంగాలను పరిశీలించేలా కూడా కోర్టు ఆదేశించాలని (SIT probe into hate speeches) పిటిషనర్లు పేర్కొన్నారు.

ఇందుకు గాను.. మజ్లీస్​ నేత అక్భరుద్దిన్ ఒవైసీ (Akbaruddin Owaisi), ఆప్​ నేత అమానాతుల్లా ఖాన్​ వంటి రాజకీయ నాయకులు చేసిన డజన్లకొద్ది వ్యాఖ్యలను ఉటంకిస్తూ తమ పిటిషన్​ను దాఖలు చేశారు.

హిందూ దేవుళ్లపై వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలపై విచారణ జరిపేలా సిట్​ను ఆదేశించాలని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. 

అదే విధంగా రాజ్యంగ స్పూర్తి, భారత ఐక్యతను దెబ్బతీసేలా చేసిన విద్వేశపూరిత ప్రసంగాల ఘటనలపై కడా విచారణకు ఆదేశించాలన కోర్టును కోరారు పిటిషనర్లు.

పిటిషన్​లో ఇంకా ఏముందంటే..

కొంత మంది ముస్లిం నాయకులు, బోధకులు.. హిందూ మతానికి వ్యతిరేకంగా, భారత సార్వభౌమధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని పిటిషనర్లు తమ పిటిషన్​లో పేర్కొన్నారు. కొంత మంది చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు..  హిందువుల్లో భయాలు సృష్టిస్తున్నాయని కూడా  తెలిపారు పిటిషనర్లు.

ఈ పరిణామాలన్ని దేశ విభజనకు దారి తీసిన ముస్లిం లీగ్​ పనిని గుర్తు చేస్తున్నాయని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్లను తమ ఫిర్యాదును న్యాయ వాది విష్ణు శంకర్ జైన్​ ద్వారా దాఖలు చేశారు.

Also raad: Covid New Guidelines: పంజా విసురుతున్న కరోనా మహమ్మారి, కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

Also read: Covid 19 Update: దేశంలో వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News