లవ్ చేయడం విదేశీ సంప్రదాయం.. అది మనకు వద్దు: బీజేపీ నేత

బీజేపీ నేత పిఎల్ శక్య ఈ రోజు అమ్మాయిలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే..యూత్ ప్రేమలో పడకపోతే మంచిదని ఆయన అన్నారు

Last Updated : Mar 26, 2018, 12:59 PM IST
లవ్ చేయడం విదేశీ సంప్రదాయం.. అది మనకు వద్దు: బీజేపీ నేత

బీజేపీ నేత పిఎల్ శక్య ఈ రోజు అమ్మాయిలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే..యూత్ ప్రేమలో పడకపోతే మంచిదని ఆయన అన్నారు. మహిళలపై రోజు రోజుకూ పెరిగిపోతున్న దాడులకు కారణం ప్రేమవ్యవహారాలే అని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉందని.. దేశ వికాసంలో వారు కూడా భాగస్వాములని.. అటువంటి వారిపై లైంగిక అరాచకాలను తాను చూడలేకపోతున్నానని శక్య అన్నారు. ఈ క్రమంలో ఆయన యువతకు హితబోధ చేశారు.

యువత పాశ్యాత్య సంప్రదాయాలకు అలవాటు పడకూడదని.. లవ్ చేయడం విదేశీ సంప్రదాయమని.. అటువంటి సంప్రదాయాలకు భారతీయ యువత అలవాటు పడకపోతే మంచిదని ఆయన తెలిపారు. ఈ రోజు ప్రేమ వ్యవహారాలు శ్రుతి మించి యువత భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని శక్యా అన్నారు. ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లి మీద కూడా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. విరాట్ కోహ్లీకి దేశభక్తి లేదని.. అందుకే ఆయన ఇటలీలో పెళ్లి చేసుకున్నారని శక్య అన్నారు. 

Trending News