Farmers Tractor Rally: రైతు ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డారు

Farmers Tractor Rally: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని రైతు సంఘాలు స్వయంగా చెబుతున్నాయి. అంటే ఏం జరుగుతున్నట్టు..

Last Updated : Jan 26, 2021, 07:52 PM IST
Farmers Tractor Rally: రైతు ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డారు

Farmers Tractor Rally: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని రైతు సంఘాలు స్వయంగా చెబుతున్నాయి. అంటే ఏం జరుగుతున్నట్టు..

కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలకు ( New Farm Bills ) వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు  గత 3 నెలలుగా ఆందోళన  ( Farmers protest ) చేస్తున్నారు. రిపబ్లిక్ డే పురస్కరించుకుని  భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. అయితే ట్రాక్టర్ ర్యాలీ చివరికి హింసాత్మకంగా మారింది. ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. బ్యారికేడ్లు ధ్వంసం చేస్తూ..బస్సులు, పోలీసు వాహనాలన్ని విధ్వంసం చేస్తూ రైతుల ట్రాక్టర్ ర్యాలీ ( Farmers tractor rally ) ముందుకు దూసుకెళ్లింది. భాష్పవాయువు ప్రయోగించినా రైతుల ర్యాలీ ఆగలేదు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ జరపాల్సి వచ్చింది. 

గణతంత్ర వేడుకలు ( Republic day celebrations ) ముగిసిన తరువాత మాత్రమే టాక్టర్ ర్యాలీ ( Tractor Rally ) కి పోలీసులు అనుమతిచ్చినా..ఉదయం 8 గంటలకే ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభమైపోయింది. కేటాయింటిన రూట్లలో కాకుండా సెంట్రల్ ఢిల్లీవైపుకు ట్రాక్టర్ ర్యాలీ సాగింది. పోలీసులు నిలువరించే ప్రయత్నంలో ట్రాక్టర్లు ముందుకు దూసుకుపోయి..అదుపు తప్పి ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఎర్రకోట ( Red Fort ) పైకెక్కి..త్రివర్ణ పతాకం స్థానంలో తమ జెంజా ఖల్సా ( Khalistan flag ) ను ఎగురవేశారు. పూర్తిగా పరిస్థితి చేయి దాటాక రైతులు ఇప్పుడు స్పందించారు.

శాంతియుతంగా చేపట్టిన ర్యాలీలో అసాంఘిక శక్తులు ( Anti social elements ) చొరబడ్డాయని ఆరోపించారు. హింసకు పాల్పడిన వ్యక్తులు రైతులు కానేకారని రైతు సంఘాలు ( Farmer unions ) స్పష్టం చేశాయి. రైతుకు వ్యవసాయం చేయడం మాత్రమే తెలుసని..హింసకు ఎప్పుడూ వ్యతిరేకమేనని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. ఢిల్లీలో అల్లర్లు చెలరేగే ప్రమాదమున్నందున ముందు జాగ్రత్త చర్యగా ప్రధాన రహదారుల్ని మూసివేశారు. పార్లమెంట్, విజయ్ చౌక్, రాజ్‌పథ్, ఇండియా గేట్ మార్గాల్ని డైవర్ట్ చేశారు. ఫలితంగా ట్రాఫిక్ పెరిగిపోయింది.

Also read: New Delhi: ఎర్రకోటపై తమ జెండా ఎగురవేసిన రైతులు, ఉద్రిక్తంగా మారుతున్న Tractor Rally

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News