Delhi: రాజధానిలో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్

దేశరాజధాని ఢిల్లీలోని ఐదుగురు ఉగ్రవాదులను (5 Terrorists arrested) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ (Delhi) లోని షకర్పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ తర్వాత ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు (Delhi Police Special Cell)  అరెస్టు చేశారు.

Last Updated : Dec 7, 2020, 11:13 AM IST
Delhi: రాజధానిలో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్

Five terrorists arrested from Delhi's Shakarpur area: న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఐదుగురు ఉగ్రవాదులను (5 Terrorists arrested) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ ( Delhi ) లోని షకర్పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ తర్వాత ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు (Delhi Police Special Cell)  అరెస్టు చేశారు. అయితే వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు ముగ్గురు, పంజాబ్‌కు చెందిన వారు ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహా తెలిపారు. ముందుగా ఢిల్లీ పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని, ఆతర్వాత వారిని పట్టుకున్నట్లు పోలీసులు (Delhi Police) వెల్లడించారు. 

పట్టుబడిన ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఐదుగురు ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టుతో దేశ రాజధాని నగరంలో మరో ఉగ్రదాడి కుట్రను పోలీసులు విఫలం చేశారు. అయితే దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. Also read: Benefits of Egg: రోజూ ‘గుడ్డు’ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

ఇదిలాఉంటే.. 20రోజుల కిందట ఢిల్లీలో ఉగ్రదాడికి వ్యూహం పన్నిన ఇద్దరు జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా వారి నుంచి భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  Also read: New Parliament Building: కొత్త సౌధానికి 10న పూనాది రాయి

Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News