India Covid-19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,815 మందికి వైరస్ పాజిటివ్ (Corona Cases in India)గా నిర్ధారణ అయింది. మహమ్మారితో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 20,018 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.36 శాతంగా నమోదైంది.
భారత్ లో ఇప్పటివరకు నమోదైన మెుత్తం కేసుల సంఖ్య 4,42,39,372 కాగా...టోటల్ మరణాల సంఖ్య 5,26,996గా ఉంది. కోలుకున్నవారి సంఖ్య 4,35,73,094గా నమోదైంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,264గా ఉంది. నిన్న మరో 3,62,802 మందికి కరోనా టెస్టులు చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. నిన్న 24,43,064 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు నమోదైన టీకా డోసుల సంఖ్య 207,71,62,098కు చేరింది.
వరల్డ్ వైడ్ గా కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 7,80,825 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారితో 2,093 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్ లో కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 2,24,929 కేసులు వెలుగుచూడగా.. వైరస్ తో 214 మంది మరణించారు.
Also Read: Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... ఇవాళ 169 రైళ్లు రద్దు.. రద్దయిన రైళ్ల జాబితా ఇదే..
#COVID19 | India reports 15,815 fresh cases and 20,018 recoveries in the last 24 hours.
Active cases 1,19,264
Daily positivity rate 4.36% pic.twitter.com/dn5ZzDtCOI— ANI (@ANI) August 13, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook