మరోమారు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

మరోమారు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

Last Updated : Sep 29, 2018, 09:07 AM IST
మరోమారు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. చమురు కంపెనీలు శనివారం ప్రకటించిన ధరల ప్రకారం..  పెట్రోల్‌పై లీటర్‌కు 22 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెరిగాయి.

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.83.40 కాగా, డీజిల్‌ రూ.74.63గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు 22 పైసల చొప్పున పెరగగా లీటర్‌ పెట్రోల్‌ రూ.90.75లు కాగా, డీజిల్‌ రూ.79.23లుగా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర లీటరు రూ.85.21లు ఉండగా, డీజిల్‌ ధర రూ.76.48గా ఉంది. చెన్నైలో పెట్రోలు ధర రూ. 86.70లు ఉండగా, డీజిల్‌ ధర రూ. 78.91గా ఉంది.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.88.42లు ఉండగా, డీజిల్‌ రూ.81.18లు ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.44లు ఉండగా, డీజిల్‌ రూ.79.89లు ఉంది.

కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం పడుతోందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.

కాగా ఇంధన ధరలు పెరగడంతో దీని ప్రభావం రవాణా రంగంతో పాటు అన్ని రంగాలపై పడుతుందని.. దేశంలో నిత్యావసర సరుకుల నుంచి అన్ని వస్తువులు పెరిగిపోతున్నాయని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Trending News