Fuel Prices: ఇంధన ధరలు త్వరలో తగ్గనున్నాయి. పెట్రో, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
గత కొద్దికాలంగా భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol-Diesel Prices) సామాన్యులకు చెమటలు పట్టిస్తున్నాయి.పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. సమయం వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు పన్నుల్లో కోత పెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుందని తెలిసింది. గత ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల ఆదాయంలో భారీ వృద్ధిని చూపించింది. దీనికి ప్రధాన కారణం ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ ఆదాయం భారీగా పెరగడమే. రానున్న నెలల్లో ఆదాయంలో బలమైన వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావంతో కేంద్ర ప్రభుత్వం ఉంది.
కేంద్ర ప్రభుత్వం(Central government) గత ఏడాది పెట్రోల్‌పై లీటర్‌కు 13 రూపాయలు, డీజిల్‌పై లీటర్‌కు 16 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 32.90 రూపాయలకు చేరుకోగా..విక్రయ ధరలో సుమారు 39 శాతం ఎక్సైజ్ సుంకమే ఉంది. అదే విధంగా డీజిల్ లీటర్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం 31.80 రూపాయలుగా ఉంది. రాష్ట్రాల్లో వ్యాట్, ఇతర పన్నులు కూడా కలుపుకుంటే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరల్లో పన్నుల వాటా 55-60 శాతంగా ఉంటోంది. వెరసి కొనుగోలుదారులకు ఇంధన ధరలు(Fuel prices) భారంగా పరిణమించాయి.పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిత్వరలో తగ్గిస్తామన్న సీబీఐసీ(CBIC) చీఫ్ అందుకు నిర్ధిష్ట కాలపరిమితిని మాత్రం వెల్లడించలేదు.
Also read: Post office savings account: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook